Anand Deverakonda: ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ – రష్మిక పేర్లు ముందు వరుస లో ఉంటుంది. వీళ్లిద్దరి పెళ్లి ఒక సెన్సేషన్. సోషల్ మీడియా లో ఇప్పటికీ వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సుమారుగా 8 ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూ,ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ డేటింగ్ చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించకుండా , చాలా సీక్రెట్ గా మైంటైన్ చేశారు. చివరికి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ, వీళ్ళ పెళ్లిని ప్రకటించి , రాజస్థాన్ లో చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా నటించిన ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని మొదలు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూ లో రష్మిక తో తనకు ఉన్నటువంటి బంధం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘రష్మిక వరుసకు నాకు వదిన, కానీ నేను ఆమెని వదిన అని పిలవను. ఎందుకంటే ఆమె నాకన్నా చాలా చిన్నది. అందుకే రషీ అని పిలుస్తుంటాను. తప్పుగా అనుకోవద్దు. ఆమె చాలా పాజిటివ్ సోల్. చాలా జోవియల్ గా ఉంటుంది. జీవితాంతం ఆమె ఎప్పుడు అలాగే ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ.
ఇక ‘ఎపిక్’ విషయానికి వస్తే ఈటీవీ విన్ యాప్ లో ప్రసారమైన ’90’s’ అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమిది. శివాజీ పెద్ద కొడుకు విదేశాలకు వెళ్లిన తర్వాత అతనికి ఎదురైనా సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, మళ్లీ ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య కలిసి చేస్తున్న చిత్రం కావడం తో , ఈ సినిమా పై మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.