Vijay Deverakonda: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే చాలామంది దర్శకులు ఒక సూపర్ సక్సెస్ ను అందించినా కూడా తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం తడబాడుతున్నారు. రామ్ పోతినేనికి భారీ విజయాన్ని అందించాడు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను కట్టబెట్టాడు…
సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు కి సూపర్ హిట్ ను అందించిన పరశురామ్ సైతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో తనకు భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు… ఇక శివ నిర్వాణ సైతం నాని, నాగచైతన్యలకు నిన్ను కోరి, మజిలీ లాంటి సినిమాలను ఇచ్చాడు. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం ఖుషి లాంటి ఒక రాడ్ సినిమాని ఇవ్వడం ప్రతి ఒక్కరిని తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది.
అలాగే ఇప్పుడు రవితేజతో చేసిన ‘ఇరుముడి’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏది ఏమైనా కూడా శివ నిర్వాణ ‘ఇరుముడి’ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి. గౌతమ్ తిన్ననూరి సైతం నానికి జెర్సీ లాంటి సక్సెస్ ని అందించాడు. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం కింగ్ డమ్ మూవీ తో విజయ్ కి ఒక ఫ్లాప్ సినిమాని కట్టబెట్టాడు…
మొత్తానికైతే స్టార్ డైరెక్టర్లందరు ఇతర హీరోలకు విజయాలను కట్టబెడుతున్నారు. విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నారు అంటూ అతని అభిమానులు సైతం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…ప్రస్తుతం ఆయన రణబాలి, రౌడీ జనార్ధన్ సినిమాలను చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…