Rashmika: ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా విజయ్ దేవరకొండ, రష్మిక జంట మొదటి స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో ఏళ్ళ నుండి రహస్యం గా డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 26 న రాజస్థాన్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు కలిసున్న ఫోటోలు , వీడియోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటికి లక్షల సంఖ్యలో లైక్స్ , కామెంట్స్ వస్తుంటాయి. ఇదంతా పక్కన పెడితే , రష్మిక , విజయ్ దేవరకొండ దంపతులు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ రూమర్స్ ప్రచారం అవ్వడానికి ప్రధాన కారణం , రీసెంట్ గా ఆమె ఒక ప్రైవేట్ వెడ్డింగ్ కి హాజరు అవ్వడమే. రీసెంట్ గానే షూటింగ్ సమయం డ్యాన్స్ వేస్తూ గాయాలపాలై, డాక్టర్ల సలహాల మేరకు విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నా రష్మిక, ఒక్కసారిగా ఈ ప్రైవేట్ వివాహ వేడుక లో అనార్కలి డ్రెస్ ధరించి , దుప్పట్టా తో పొట్ట భాగాన్ని కవర్ చేస్తూ కనిపించడంతో , ఆమె గర్భం దాల్చిందని , బేబీ బంప్ ని దాచేందుకే ఆమె అలా చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పక్కనే విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. అయితే బొద్దు గా అయ్యినంత మాత్రానా, గర్భం దాల్చినట్టు కాదు , ఫిట్నెస్ లోపించినప్పుడు కూడా ఇలా బొద్దుగా మారుతుంటారు. రష్మిక మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆమె ఎలాంటి వర్కౌట్స్ చేయకుండా విశ్రాంతి మోడ్ లో ఉండడం వల్లనే ఇలా లావు పెరిగి ఉండొచ్చు , అంతకు మించి ఏమి లేదని సోషల్ మీడియా లో మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఈమె చేతుల్లో ‘రణబలి ‘, ‘రాకా’, ‘మైసా’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రణబలి’ లో చాలా కాలం తర్వాత తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ రాకా లో ఈమె విలన్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే రీసెంట్ గా జరిగిన గాయం కారణంగా , ఈమె ఈ చిత్రం నుండి తప్పుకుందని , ఆమె స్థానంలోకి తమిళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి నటిస్తోందని అంటున్నారు. ఈ రెండు కాకుండా ఆమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’. దీనిపైన కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి.