Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: చిరంజీవి,రజినీకాంత్ లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..ఇది మామూలు సాహసం కాదు!

Vijay Devarakonda: చిరంజీవి,రజినీకాంత్ లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..ఇది మామూలు సాహసం కాదు!

Vijay Devarakonda: ప్రస్తుతం యంగ్ హీరోల్లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ, తీవ్రమైన కెరీర్ సంక్షోభం లో ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘గీత గోవిందం’ తర్వాత ఇతని కెరీర్ లో ఒక్క సరైన హిట్ లేకపోవడం దురదృష్టకరం. ‘లైగర్’ చిత్రం తో భారీ హిట్ ని అందుకొని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడుతాడేమో అని అనుకుంటే, ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ […]

Vijay Devarakonda: ప్రస్తుతం యంగ్ హీరోల్లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ, తీవ్రమైన కెరీర్ సంక్షోభం లో ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో విజయ్ దేవరకొండ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘గీత గోవిందం’ తర్వాత ఇతని కెరీర్ లో ఒక్క సరైన హిట్ లేకపోవడం దురదృష్టకరం. ‘లైగర్’ చిత్రం తో భారీ హిట్ ని అందుకొని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడుతాడేమో అని అనుకుంటే, ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం లో ఈయన హీరోగా నటించిన ‘ఖుషి’ చిత్రం కూడా డిజాస్టర్ గా నిల్చింది. ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినప్పటికీ, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో, ఇతని మార్కెట్ కి ఎలాంటి కుదుపు రాలేదు. కానీ ఆయన గత చిత్రం ‘కింగ్డమ్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఆడియన్స్ ని నిరాశపర్చడంతో, విజయ్ దేవరకొండ ఇక కం బ్యాక్ ఇవ్వడం కష్టమేమో అని అందరూ అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా లో అందరినీ షాక్ కి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి ప్రస్తుతం ఆయన ‘రణబలి’ అనే చిత్రం చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ లో జరిగిన కొన్ని యాదార్థ పోరాట ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రేడ్ లో అంచనాలు పర్లేదు అనే రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం అవుతుందనే లెక్కలో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రీసెంట్ గానే నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రానికి పోటీగా రజినీకాంత్ ‘జైలర్ 2’, మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. అంత పెద్ద సూపర్ స్టార్స్ సినిమాలకు, విజయ్ దేవరకొండ ఇప్పుడున్న పరిస్థితిలో పోటీకి వెళ్లడం అవసరమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.ఎందుకంటే బయ్యర్స్ ఆ రెండు సినిమాలకే అత్యధికంగా థియేటర్స్ ని కేటాయిస్తారు. మిగిలినవి ‘రణబలి’ కి వెళ్తాయి. గ్లింప్స్ వీడియో చూస్తుంటే నిర్మాతలు ఈ సినిమాకు భారీ గానే ఖర్చు చేసినట్టుగా అనిపిస్తోంది. మరి అంతటి భారీ బడ్జెట్ చిత్రం క్లాష్ లో నిలబడి తట్టుకోగలదా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper