Homeఎంటర్టైన్మెంట్Multiplex Business : ఇది యాపారం.. పెద్ద పెద్ద హీరోలు థియేటర్లు కట్టేది అందుకే..

Multiplex Business : ఇది యాపారం.. పెద్ద పెద్ద హీరోలు థియేటర్లు కట్టేది అందుకే..

Multiplex Business : ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు విపరీతంగా ఉండేవి. పెద్ద పెద్ద స్టార్ హీరోలుగా చలామణి అయిన వాళ్ల సినిమాలు మొత్తం ఆ థియేటర్లలోనే విడుదలయ్యేవి.. ఆ థియేటర్ల లోనే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా స్వరూపం సరికొత్తగా రూపాంతరం చెందింది. సింగల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో పేరుపొందిన నటులు మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. కేవలం థియేటర్లు మాత్రమే కాకుండా.. షాపింగ్.. ఈటింగ్.. […]

Multiplex Business : ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు విపరీతంగా ఉండేవి. పెద్ద పెద్ద స్టార్ హీరోలుగా చలామణి అయిన వాళ్ల సినిమాలు మొత్తం ఆ థియేటర్లలోనే విడుదలయ్యేవి.. ఆ థియేటర్ల లోనే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచేవి.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా స్వరూపం సరికొత్తగా రూపాంతరం చెందింది. సింగల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో పేరుపొందిన నటులు మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. కేవలం థియేటర్లు మాత్రమే కాకుండా.. షాపింగ్.. ఈటింగ్.. ఇంకా అమ్యూజ్మెంట్ అనే కేటగిరీలుగా మల్టీప్లెక్స్ లు నిర్మిస్తూ.. దండిగా వెనకేసుకుంటున్నారు.

తెలుచిత్ర పరిశ్రమలు సొంతంగా మల్టీప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎవరంటే మహేష్ బాబు అని చెప్పవచ్చు. హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ పేరుతో అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్ ను మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ దేశంలోనే అత్యుత్తమ థియేటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

అల్లు అర్జున్

హైదరాబాదులోని అమీర్పేట ప్రాంతంలో ఒకప్పుడు సత్యం థియేటర్ ఉన్న స్థలాన్ని అల్లు అర్జున్ కొనుగోలు చేశారు. ఈయన కూడా ఏషియన్ గ్రూప్ తో జట్టు కట్టి.. ఏషియన్ అల్లు అర్జున్ సినిమా పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో అత్యాధునికత సాంకేతికత.. లగ్జరీ సీటింగ్ ఉంటుంది.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏవిడి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. దీనిని ఏషియన్ విజయ్ దేవరకొండ పేరుతో పిలుస్తున్నారు.

ప్రభాస్

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వి ఎపిక్ పేరుతో ఒక థియేటర్ నిర్మించారు. ఇది ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ ల ఒకటి. ఇందులో ప్రభాస్ తోపాటు యు వి క్రియేషన్స్ కు భాగస్వామ్యం ఉంది.

దండిగా వ్యాపారం

సింగల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ విపరీతంగా ఉంటుంది. కరెంట్ బిల్లులు.. ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందులో కేవలం సినిమాల ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది. పెద్దపెద్ద హీరోల సినిమాలు విడుదల ఇప్పుడు మాత్రమే సింగల్ స్క్రీన్లు ఫుల్ ఆక్యుపై అవుతాయి. మామూలు సినిమాలు విడుదలైనప్పుడు సగం కూడా ఆక్యుఫెన్సీ రాదు. వచ్చిన ఆదాయం కరెంటు ఖర్చులకు.. సిబ్బంది జీతాలకే వెళ్ళిపోతుంది. ఇతర ఖర్చులకు అప్పులు తీసుకురావాల్సిందే.

పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఓటిటి కి అలవాటు పడ్డారు. పైగా మూస విధానంలో వచ్చే సినిమాలను అంతగా చూడడం లేదు. దీంతో ఈ ప్రభావం సింగల్ స్క్రీన్ థియేటర్ల మీద విపరీతంగా పడుతూ ఉంది. అందువల్లే ఆ థియేటర్లు మూతపడుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎక్కువగా ఏషియన్ గ్రూప్.. దిల్ రాజుకు సంబంధించిన సంస్థలు లీజుకి తీసుకున్నాయి. కొన్ని థియేటర్లు మైత్రి మూవీస్ చేతిలో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంతగా లేకపోవడంతో.. సర్దుబాటు కష్టంగా మారుతుంది. అప్పుడే నిర్మాతల మధ్య గొడవలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో థియేటర్ల సర్దుబాటు సాధ్యం కాక కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. నిర్మాతల చేతుల్లో థియేటర్లు ఎక్కువగా ఉండటంతో వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సినిమాలను మాత్రమే ఆడిస్తున్నారు. ఒకవేళ ఆ సినిమాలు అంతగా మౌత్ ట్రాక్ సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. వాటిని బలవంతంగా ఆడిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

మల్టీప్లెక్స్లకు పోటీగా 4k ప్రొజెక్షన్.. డాల్బీ అటామాస్ సౌండ్ సిస్టం.. ఫుష్ బ్యాక్ సీట్లు అమర్చడానికి విపరీతంగా ఖర్చు అవుతుంది. అంత పెట్టుబడి పెట్టె స్తోమత చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు లేదు. కొందరు సింగిల్ స్క్రీన్ థియేటర్లను లీజుకు ఇస్తున్నారు. మరి కొంతమంది అమ్మేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే.. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఓడియన్.. సంధ్య.. సుదర్శన్.. దేవి వంటి థియేటర్లు ఉండేవి. ఇందులో చాలా వరకు థియేటర్లు మూతపడి.. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. కొన్ని థియేటర్లు నడుస్తున్నప్పటికీ.. లాభసాటిగా లేకపోవడంతో కొన్నిసార్లు మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అవి కూడా మూతపడి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper