Ranabaali Movie Review: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ , ఈసారి ఎలా అయినా కుంభస్థలం బద్దలు కొట్టాలి అనే రేంజ్ కసి తో చేసిన చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం , విడుదలకు ముందు టీజర్ , ట్రైలర్, పాటలు మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగించారు. నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా, కచ్చితంగా బాగానే ఉంటుంది , పైగా రాహుల్ సంక్రుత్యాన్ మంచి విషయమున్న డైరెక్టర్ , సినిమా ఔట్పుట్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూ లో మనం ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం.
కథ విషయానికి వస్తే మన దేశానికీ స్వతంత్రం కోసం పోరాడిన ఒక వీరుడి గురించి వెండితెర పై చూపించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ రాహుల్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ‘రణబాలి ‘ వీరోచిత పోరాటం గురించి నేటి తరం ఆడియన్స్ కి తెలియదు. అత్యాశతో మన దేశం లోకి చొరబడి , మన భారతీయులను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసిన బ్రిటీషర్స్ భరతం పట్టే పాత్రలో ఇందులో మనం విజయ్ దేవరకొండ ని చూడవచ్చు. బ్రిటీషర్స్ అకృత్యాల నుండి రణబాలి తన జనాలను కాపాడుకునే ప్రయత్నాలు ఎలా చేసాడు అనేది వెండితెర పై చూడాల్సిందే.
విజయ్ దేవరకొండ తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన కేవలం యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ ని మాత్రమే చేస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదటిసారి ఆయన ఈ రేంజ్ ఇంటెన్సిటీ ఉన్న రోల్ లో కనిపించాడు. పాపం ఆయన పాత్ర కోసం బాగా కష్టపడినట్టు అనిపించింది కానీ , ఎందుకో అనేక సన్నివేశాల్లో ఆయన ఈ సినిమాకు సూట్ కాదేమో అనే ఫీలింగ్ ని కలిగించింది. సాధారణంగా ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించాలి. కానీ డైరెక్టర్ ఆ విషయం లో దారుణంగా విఫలం అయ్యాడు అనే చెప్పాలి. సినిమా నిడివి దాదాపుగా 3 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. రన్ టైం అసలు సమస్యే కాదు , నాలుగు గంటల రన్ టైం ఉన్నా ఆడియన్స్ కి నచ్చేట్టు తీస్తే థియేటర్స్ కి వచ్చి చూస్తారు , కానీ ఈ సినిమా రన్ టైం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపిస్తుండట. అంతే కాకుండా సినిమాలో హింసాత్మక సన్నివేశాల మోతాదు చాలా ఎక్కువగా ఉంది. సినిమా మొత్తం మీద ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశం మంచి హై ని ఇస్తాది.
ఫస్ట్ హాఫ్ , సెకండ్ హాఫ్ లలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా కుదిరాయి. కానీ సినిమా స్క్రీన్ ప్లే ని ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దడం లో మాత్రమే డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఇక అజయ్ అతుల్ అందించిన మ్యూజిక్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ‘ఏందయ్యా సామీ’ అనే పాటకు విడుదలకు ముందే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీద కూడా ఈ పాట చాలా బాగా వచ్చింది. కానీ కీలకమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం నిడివి ని బాగా తగ్గిస్తే ఆడియన్స్ కి కాస్త కనెక్ట్ య్యే అవకాశాలు ఉంటాయని , చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దెందుకు డైరెక్టర్ ప్రయత్నం చేసాడు, కానీ టేకింగ్ లో తేడా కొట్టేసింది , ఓవరాల్ గా ఈ చిత్రానికి మేము ఇస్తున్న రేటింగ్ 2.5 /5..మీరు ఈ చిత్రాన్ని చూసుంటే , మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.