Ranabaali Movie: విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘రణబాలి’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రమిది. అంతే కాకుండా రష్మిక తో పెళ్లి తర్వాత , ఆమెతో కలిసి చేసిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే. పెళ్ళికి ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండిట్లో ‘గీత గోవిందం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆడియన్స్ నుండి మంచి రివ్యూస్ ని సొంతం చేసుకున్నాయి. మరి నేడు విడుదలైన ‘రణబాలి’ చిత్రం , ఆడియన్స్ ని ఏ మేరకు అలరించింది?, ట్విట్టర్ లో ఆడియన్స్ ఈ చిత్రం గురించి ఏమి అనుకుంటున్నారో వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం.
డైరెక్టర్ చాలా నిజాయితీగా జరిగిన యదార్ధ సంఘటనలను వెండితెర పై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని , కానీ నత్త నడకన సాగే స్క్రీన్ ప్లే , ఫ్లాట్ న్యారేషన్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేలా చేశాయని అంటున్నారు. వెండితెర పై విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు కాస్త చూడదగినదిగా ఉందని , సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ అదేనని అంటున్నారు. కానీ ఇలాంటి జానర్ సినిమాలకు ఎమోషనల్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలని , ఆ కనెక్షన్ ని బిల్డ్ చేయడం లో డైరెక్టర్ దారుణంగా విఫలం అయ్యాడని అంటున్నారు. ప్రతీ సన్నివేశాన్ని బాగా సాగదీసినట్టుగా ఉందని అంటున్నారు. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయట. ఖర్చు పరంగా నిర్మాతలు ఎక్కడ రాజీ పడలేదట , ఖర్చుపెట్టిన ప్రతీ పైసా వెండితెర పై కనిపించిందట. ఇక విజయ్ దేవరకొండ చాలా కష్టపడి నటించాడని , కానీ అనేక సన్నివేశాల్లో ఎందుకో ఈ పాత్ర ఆయనకు తగినది కాదనే ఫీలింగ్ కలిగిందని అంటున్నారు.
ఇలాంటి సినిమాల్లో నేపధ్య సంగీతం అద్భుతంగా ఉండడం చాలా అవసరం. సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చెయ్యాలి , కానీ ఆ విషయం లో సంగీత దర్శకుడు దారుణంగా విఫలం అయ్యాడని అంటున్నారు. అంతే కాకుండా సినిమాని ఎడిటింగ్ లో తీసివేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు , కానీ డైరెక్టర్ రాహుల్ తన టేకింగ్ తో ఆడియన్స్ కి బాగా బోర్ కొట్టించాడని అంటున్నారు నెటిజెన్స్.