Vijay Devarakonda: ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా యూత్ ఆడియన్స్ లో చెక్కు చెదరని క్రేజ్ తో ముందుకెళ్తున్న యంగ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది విజయ్ దేవరకొండ మాత్రమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయనకు , అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్స్ పడ్డాయి. దీంతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ వచ్చేసింది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రం అయితే విజయ్ దేవరకొండ కి నార్త్ ఇండియా లో కూడా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అలాంటి విజయ్ దేవరకొండ కి ‘గీత గోవిందం’ తర్వాత వరుసగా డిజాస్టర్ ఫ్లాపులే ఎదురు అవుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘రణబాలి’ చిత్రానికి కూడా డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక విజయ్ దేవరకొండ పైకి లేయడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే ఈ చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా రాబోతుంది. అందుకు ముఖ్య కారణం దసరా సీజన్ ఒకటి అయితే , విక్టరీ వెంకటేష్ కూడా మరో కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అక్టోబర్ 9 న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ డేట్ మిస్ అయితే అక్టోబర్ 16 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం అక్టోబర్ 30 కి ఆ సినిమా షిఫ్ట్ అయ్యింది. ఒకవేళ చెప్పిన తేదికి ఆ చిత్రం వచ్చి ఉండుంటే కచ్చితంగా ‘రణబాలి’ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే ఆడియన్స్ కి ఇప్పటికే మొదటి ఛాయస్ గా ‘జైలర్ 2’ చిత్రం ఉంది. ఒకవేళ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తే , ఆడియన్స్ దానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తారు.
డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా రెండవ ఛాయస్ గా ఆ సినిమాని పెట్టుకుంటారు. ‘రణబాలి’ ని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం వాయిదా పడడం వల్ల , విక్టరీ వెంకటేష్ పరోక్షంగా విజయ్ దేవరకొండ కెరీర్ ని రక్షించాడు అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ‘రణబాలి’ వసూళ్ల విషయానికి వస్తే , ఈ చిత్రాన్ని బయ్యర్స్ 42 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. మామూలు సమయం లో వచ్చి ఉండుంటే ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచేది , కానీ దసరా సీజన్ లో రావడం విజయ్ దేవరకొండ అదృష్టం అని అంటున్నారు నెటిజెన్స్. అంతే కాకుండా విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది అంటున్నారు. ఈ సినిమా పై మొదటి నుండి పెద్దగా హైప్ లేకపోయినప్పటికీ , ఓపెనింగ్ వసూళ్లు మొదటిరోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజులకు కలిపి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, దసరా రోజున , అనగా 5 వ రోజున ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని , మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి హోల్డ్ ని చూపిస్తే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుందని , చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో క్లీన్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.