Rashmika Mandanna: సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఒక సంచలనాత్మక రూమర్ విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులను కలవరపెడుతోంది. రీసెంట్ గా వీళ్లిద్దరు బాలీవుడ్ లో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షో లో పాల్గొన్నారని , ఈ షోలో విజయ్ రష్మిక ని అవమానించడం తో ఒక గంటపాటు షో ఆగిపోయిందని. విజయ్ ఆమెకు క్షమాపణలు చెప్పి కూల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్కౌట్ అవ్వలేదని, ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్లిద్దరు ఒకే కారులో కాకుండా , వేర్వేరుగా వెళ్లారని , త్వరలోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈమధ్యనే పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడుపుతున్న ఈ జంటపై , ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ ని క్రియేట్ చేయడం అన్యాయమని అంటున్నారు.
అయితే సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ ప్రచారం పై రష్మిక కాసేపటి క్రితమే రెస్పాన్స్ ఇచ్చింది. పనికిమాలిన ఊహాగానాలకు వివరణ ఇస్తున్నాను అంటూ 6 పేజీల మ్యాటర్ రాసి , క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా నేడు విజయ్ దేవరకొండ తో కలిసి వర్కౌట్ చేసిన వీడియో ని ఒకటి షేర్ చేసి , తమ బంధం ఎంత బలమైనదో చెప్పకనే చెప్పింది. ఈమధ్య కాలం లో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వ సాధారణం అవ్వడం తో , వీళ్ళ విడాకులు న్యూస్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు రష్మిక క్లారిటీ ఇవ్వడం తో ఈ పుకార్లకు చెక్ పడింది. భవిష్యత్తులో మళ్లీ వీళ్లిద్దరి పై ఇలాంటి రూమర్స్ వస్తాయో లేదో చూడాలి.