Ranabaali Movie: విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘రణబాలి’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ దసరా సీజన్ కావడం తో ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతున్నాయి. విడుదలకు ముందు 42 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన నెగెటివ్ టాక్ ని చూసి , పాపం ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ పరిస్థితి ఏంటో అని అంతా అనుకున్నారు. కానీ మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా వస్తుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. గీతా గోవిందం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ కి క్లీన్ సూపర్ హిట్ ఈ సినిమాతోనే దక్కింది. మొదటి వారం లో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
గ్రాస్ వసూళ్లు దాదాపుగా 66 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఈమధ్య కాలం లో దేశభక్తి కి సంబంధించిన సినిమాలకు మన తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ బాగా తగ్గిపోయింది. అలాంటి సమయం లో కూడా ‘రణబాలి’ డివైడ్ టాక్ తో ఈ రేంజ్ కి చేరుకోవడం మామూలు విషయం కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే నైజాం , సీడెడ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని సొంతం చేసుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం , ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు ముందు నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 11 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
మొదటి వారం 14 కోట్ల 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 3 కోట్ల 21 లక్షల రూపాయిల లాభాలు అన్నమాట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సినిమాకు , ఫ్లాప్ టాక్ తో నైజాం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది అరుదైన సంఘటన గా చూడొచ్చు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో విడుదలకు ముందు 4 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, మొదటి వారం లో 4 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 12 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి మొదటి వారం లో 8 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 51 లక్షల రూపాయిలు వచ్చాయి.