Ranabaali Movie: విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ పడింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ మార్క్ ఓపెనింగ్ పడింది అనే చెప్పాలి. వరుసగా 5 డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా , విజయ్ దేవరకొండ కి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అది కూడా టాక్ తో సంబంధం లేకుండా, ఒకవేళ టాక్ వచ్చి ఉండుంటే ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో మీరే ఊహించుకోండి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరం చూడబోతున్నాము.
ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 3 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 63 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 2 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 3 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 10 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ డబ్బింగ్ కి కలిపి 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని , ఓవర్సీస్ నుండి 2 కోట్ల 40 లక్షల రూపాయిలు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే 21 శాతం రీకవరీ జరిగింది. వీకెండ్ పూర్తి అయ్యేవరకు కచ్చితంగా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , వీకెండ్ తర్వాత కనీస స్థాయి హోల్డ్ చూపించినా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ గా మొదటి వారం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే ఫ్లాప్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకున్న హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా చేరిపోతాడు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.