Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: లైవ్ లో అర్థరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి టెన్షన్ పెట్టిన...

Allu Arjun: లైవ్ లో అర్థరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి టెన్షన్ పెట్టిన విజయ్ దేవరకొండ..!

Allu Arjun: టాలీవుడ్ లో అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు , కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆయనకు ఎంతో స్పెషల్. అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ని నా స్వీట్ బ్రదర్ అని సంబోధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమాకు […]

Allu Arjun: టాలీవుడ్ లో అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు , కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆయనకు ఎంతో స్పెషల్. అనేక సందర్భాల్లో అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ని నా స్వీట్ బ్రదర్ అని సంబోధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమాకు కూడా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్లిద్దరి బాండింగ్ ని తెలిపే సంఘటనలు చాలానే ఉన్నాయి.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక తో కలిసి బాలీవుడ్ లో పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో పాల్గొన్నాడు. ఇండస్ట్రీ లో మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు అంటే విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ పేరు చెప్తాడు. అప్పుడు కరణ్ జోహార్ అతనికి కాల్ చెయ్యమని చెప్పగా, విజయ్ దేవరకొండ కాల్ చేస్తాడు. అతను కాల్ చేసే సమయానికి రాత్రి 11 గంటల 40 నిమిషాలు అయ్యింది. అయినప్పటికీ అల్లు అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి విజయ్ దేవరకొండ తో కాసేపు సరదాగా చిట్ చాట్ చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి ‘ మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి , బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి దగ్గరగా చేరింది. 6 రోజుల థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకవేళ అదే జరిగితే గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో క్లీన్ సూపర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. దసరా సీజన్ లో రావడం వల్ల, ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది ట్రేడ్ పండితుల అభిప్రాయం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper