Vijay Devarakonda: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రస్తుతం చిన్న క్యారెక్టర్ రోల్స్ కూడా దొరకని రోజులివి. అలాంటిది హీరో గా ఎంట్రీ ఇచ్చి, మొదటి రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రతీ యంగ్ హీరో డ్రీం ఇది. ఆ డ్రీం ని అవలీలగా అందుకున్న వారిలో ఒకరు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా సెకండ్ హీరో రోల్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ చిత్రం తో హీరో గా మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా చేసిన ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. యూత్ ఆడియన్స్ లో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో విజయ్ దేవరకొండ కి స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ఏర్పడింది. ఇక ఆయనకు తిరుగులేదు అని అనుకుంటున్న సమయం లో నోటా , వరల్డ్ ఫేమస్ లవర్ , లైగర్ , ఖుషి , ది ఫ్యామిలీ స్టార్ , కింగ్డమ్ ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. మధ్యలో టాక్సీ వాలా అనే చిత్రం ఒక్కటే యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇన్ని ఫ్లాప్స్ పడినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ చెక్కు చెదరలేదు. అందుకు ఉదాహరణ నిన్న విడుదలైన ‘రణబాలి’ చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
అయితే విజయ్ దేవరకొండ కి యూత్ లో ఎంత క్రేజ్ అయితే ఉందో , నెగెటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంది. ఎదిగే హీరోలకు యాంటీ ఫ్యాన్స్ ఏర్పడడం సర్వసాధారణం. విజయ్ దేవరకొండ కి కూడా అలాగే యాంటీ ఫ్యాన్స్ ఏర్పడి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ప్రెస్ మీట్స్ లలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ తో మాట్లాడే కొన్ని మాటలు కూడా ఆయనపై తీవ్రమైన నెగెటివిటీ ని తెచ్చిపెట్టేలా చేస్తుంటాయి. ఇంత పొగరు ఉన్నప్పుడు , నెగెటివ్ కామెంట్స్ లేకుండా ఎలా ఉండదని అనుకోవచ్చు , కానీ బాగున్న సినిమాని కూడా బాగాలేదని చెప్పేంత నెగెటివిటీ ఎందుకు ?, విజయ్ దేవరకొండ అసలు మిమ్మల్ని ఏమి చేసాడు?, ఒక మనిషి ఆత్మాభిమానం తో ఉంటే తప్పా? అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు.
అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో పెద్ద రేంజ్ కి వెళ్లిపోయాడని అక్కసు ప్రతీ హీరో అభిమాని లోనూ ఉంది. కావాలనే విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తున్నారు , అతని విజయాన్ని కూడా వీళ్ళు తీసుకోలేరు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ‘రణబాలి ‘, ‘కింగ్డమ్’ చిత్రాలను కచ్చితంగా థియేటర్స్ లో ఒకసారి చూడొచ్చు. మరీ తీసిపారేసేంత చెత్త సినిమాలు అయితే కావు. కానీ సోషల్ మీడియా లో ఆ రెండు సినిమాలపై వచ్చిన నెగెటివిటీ ఏదైతే ఉందో వర్ణనాతీతం అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు ఇంత కసి?, పైగా విడుదల రోజే రణబాలి చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా లో లీక్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజెన్స్. ఇంతలా టార్గెట్ చేసి నెగెటివిటీ చేసేంత తప్పు విజయ్ దేవరకొండ ఏమి చేసాడు?, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.