Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం 'వారణాసి' టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన...

Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ‘వారణాసి’ టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన రాజమౌళి…

Mahesh Babu : ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. యమదొంగ సినిమా నుంచి గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక కొత్త ఒరవడి ని సృష్టించుకున్నాడు. ఇక అలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. వారణాసి సినిమాతో మహేష్ బాబు ను […]

Mahesh Babu : ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. యమదొంగ సినిమా నుంచి గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక కొత్త ఒరవడి ని సృష్టించుకున్నాడు. ఇక అలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. వారణాసి సినిమాతో మహేష్ బాబు ను సైతం పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్న ఘనత తనకే దక్కింది. ఒక తెలుగు సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లగలిగే కెపాసిటి రాజమౌళి మాత్రమే ఉందని గతంలో చాలామంది చెప్పారు. ఇక రాజమౌళి ప్రస్తుతం దానిని నిజం చేసి చూపిస్తున్నాడు. వారణాసి సినిమా దాదాపు 1600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో 4000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో ఉన్నారు. ఇక ఏదేమైనా కూడా అంతటి విజువల్స్ ని స్క్రీన్ మీద రాజమౌళి చూపించగలుగుతాడా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఈరోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘వారణాసి’ సినిమా నుంచి రెండు పోస్టర్లు రిలీజ్ చేశాడు. వాటికి మహేష్ బాబు అభిమానులు కొంత వరకు సంతృప్తి చెందినప్పటికి టీజర్ వస్తే బాగుండేదనే ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక టీజర్ ఎప్పుడొస్తుందో కూడా జక్కన్న క్లారిటి ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

టీజర్ ని అక్టోబర్ 20వ తేదీన విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతిదీ కూడా సినిమా ప్రమోషన్స్ కి వాడుకుంటూ దానికి ఎలాగైతే హైప్ వస్తుందో ఆ రేంజ్ లో ఆయన ప్రతి దాన్ని డిజైన్ చేస్తూ ఉంటాడు.

కాబట్టి టీజర్ ని కూడా అదే రేంజ్ లో డిజైన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80% పూర్తి చేశాడు. మరో 20% షూట్ ని తొందర్లోనే కంప్లీట్ చేసి ఈ సినిమాని అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper