Pawan Kalyan : తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో బాహుబలి కి ముందు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు రేంజ్ ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కి వీళ్ళిద్దరే హీరోలు , వీళ్ళ యుగమే నడుస్తోంది అనే రేంజ్ లో ఉండేది. రికార్డ్స్ కూడా వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ‘బాహుబలి’ తర్వాత అందరూ స్టార్ హీరోలు పాన్ ఇండియా కి వెళ్లిపోయారు. మహేష్ బాబు రిస్క్ చేయకుండా సేఫ్ కమర్షియల్ జానర్ సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు , ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసి , తనకు ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే సినిమాలు చేసేవాడు. ఇలా వీళ్లిద్దరు ఇతర హీరోలతో పోలిస్తే కాస్త వెనుకబడ్డారు కానీ , కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం లో మాత్రం , వీళ్ళని మ్యాచ్ చేసే హీరోలు ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరూ రాలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పరంగా వీళ్ళ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉండేది. కానీ ఎప్పుడూ కూడా వీళ్ళ మధ్య మంచి సాన్నిహిత్య సంబంధమే ఉండేది. ఒకరిని ఒకరు ఎంతగానో గౌరవించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వచ్చినప్పుడు మహేష్ బాబు , మహేష్ బాబు పుట్టినరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ , ఒకరిని ఒకరు సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు అవ్వడం తో , పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇరువురి హీరోల అభిమానులు ఎంతో సంతోషాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంపూర్ణమైన ఆరోగ్యం, సుఖ సంతోషాలతో పాటు , జీవితం లో ఎన్నో అద్భుతమైన మైలు రాళ్లను అందుకోవాలని కోరుకుంటున్నాను. మానవీయ కోణం మీరు చూపించే సామజిక బాధ్యత, ఎంతోమంది చిన్నారులను కాపాడిన మీ గొప్ప మనసు నిజంగా ఆదర్శవంతమైనది. అందరి లాగానే నేను కూడా మీ వారణాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Heartiest birthday greetings to Superstar @urstrulyMahesh Garu.
Wishing you good health, happiness, and many more memorable milestones. Your remarkable contribution to humanitarian causes and your commitment to helping children are truly inspiring.
Looking forward to witnessing… pic.twitter.com/ky8cBQtBWK
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) August 9, 2026