Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున గత 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాగార్జున ఏమాత్రం తడబడకుండా తన పంథా లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తున్న నాగార్జున ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట నుంచి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ గా వివరించబోతున్నాడట. డిఫరెంట్ సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకునే ప్రయత్నంలో తనున్నాడు. ఇక నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ప్రయత్నాలన్నీ కూడా సూపర్ సక్సెసులను సాధించాయి. అందువల్లే అతను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పాలి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి సినిమాలో తన నటనలతో ప్రేక్షకులను అలరించాడు. అందువల్లే ఆయన కింగ్ నాగార్జున గా పేరు సంపాదించుకోవడం విశేషం… ఇక నాగార్జున నమ్మిన చాలా మంది దర్శకులు అతని నమ్మకాన్ని నిలబెట్టారు. కానీ ఒక ఇద్దరు దర్శకులు మాత్రం తన నమ్మకాన్ని పూర్తిగా ఒమ్ము చేశారని గతంలో నాగార్జున చెప్పాడు.
అలాగే తను వేరే సినిమాలకు కమిట్ అయినప్పటికి ఆ దర్శకుల వల్ల ఆ సినిమాలను క్యాన్సిల్ చేసుకొని వాళ్ళతో సినిమాలు చేయడం వల్ల ఆ సినిమాలు భారీగా ఫ్లాప్ అయ్యాయి అంటూ ఆయన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ముఖ్యంగా నాగార్జున కెరీర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో ‘భాయ్’ సినిమా ఒకటి…
ఈ సినిమా దర్శకుడు వీరభద్రం చౌదరి నాగార్జునకు భారీ సక్సెస్ ని అందిస్తానని ఒక కథ చెప్పాడట. షూటింగ్ ప్రాసెస్ లో ఆ కథను మారుస్తూ షూటింగ్ చేయడం వల్ల ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ సమయంలో నాగార్జున వేరే ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి భాయ్ కథ అతనికి బాగా నచ్చడంతో నాగార్జున ఆ సినిమాని సైతం వదులుకున్నాడు…
ఇక ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో చేసిన ‘ఘోస్ట్’ సినిమా కూడా అతనికి వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ గతంలో ఆయన చెప్పాడు. ఇలా వీరభద్రం చౌదరి, ప్రవీణ్ సత్తార్ ఇద్దరు కూడా తనకు భారీ డిజాస్టర్లను అందించి తన నమ్మకాన్ని ఒమ్ము చేశారు అంటూ నాగార్జున పలు సందర్భంలో బాధపడ్డాడు…