Mahesh Babu: ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు… మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు డీలాపడ్డాడు. కానీ ఎక్కడ తగ్గకుండా కొండంత ధైర్యం తో ముందుకు అడుగులు వేస్తూ చేసిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాడు. ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం… తన కెరీర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిలబెట్టడమే కాకుండా వాళ్ళ నాన్న కృష్ణ కి ఎలాగైతే సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉండేదో దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు కూడా ఆ ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గిపోకుండా మహేష్ బాబు మంచి సినిమాలు చేసి సూపర్ స్టార్ అనే క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. మరలాంటి మహేష్ బాబు 51 సంవత్సరాల వయసులో కూడా చాలా అందంగా కనిపిస్తున్నాడు అంటే దానికి కారణం ఆయన తీసుకునే ఫుడ్, ఆయన పాటిస్తున్న డైట్ ఆయన చేస్తున్న ఎక్సర్సైజులు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మహేష్ బాబుని చూపించి ఒక పాతికేళ్ల కుర్రాడు అని చెప్పినా కూడా చాలామంది నమ్మేస్తారు… ఇంతకీ ఆయన ఏం డైట్ తీసుకుంటున్నాడు అనే విషయంలో చాలా మందికి పలు రకాల డౌట్లైతే ఉన్నాయి…
ఇక అక్కినేని నాగార్జున సైతం చాలా యంగ్ గా కనిపిస్తాడు. ఇప్పటికి ఆయన 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా 30 సంవత్సరాల కుర్రాడిలా కనిపిస్తున్నాడు. గతంలో ఒకసారి నాగార్జున కొన్ని టిప్స్ అయితే ఇచ్చారట. యంగ్ గా కనిపించడానికి ఏం చేయాలి అనే దానిమీద నాగార్జున మహేష్ బాబు కి స్పెషల్ గా కొన్ని విషయాల గురించి చెప్పారట.
ఏం తినాలి, ఎలా తినాలి అనేది కూడా నాగార్జున చెప్పాడట. ఆయన ఇచ్చిన సజెషన్ ని మహేష్ బాబు కొన్ని సందర్భాల్లో పాటిస్తూ వచ్చారట. అందువల్లే నాగార్జున చెప్పిన విషయాలు కూడా మహేష్ బాబు యంగ్ గా కనిపించడానికి చాలా వరకు హెల్ప్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన కూడా వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కాబట్టి ఆయన హాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం పక్క అంటు అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు…