Ravi Teja: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం చాలా చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా నిన్న హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘వీరాధివీరుడు ఎక్కినాడు పల్లకి’ పాటని కూడా నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ ‘ఇరుముడి’ లో తన కూతురి క్యారెక్టర్ చేసిన నక్షత్ర పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నక్షత్ర రవితేజ తో మాట్లాడుతూ ‘నాకు ఒక నిక్ నేమ్ పెట్టండి’ అని అంటుంది, అప్పుడు రవితేజ ‘ముదురు ము**’ అని పిలుస్తాడు. అప్పుడు నక్షత్ర ‘దాని అర్థం నాకు తెలియదు’ అని అనగా, రవితేజ అందుకు సమాధానం చెప్తూ ‘తర్వాత నీకు వివరిస్తాను’ అని అంటాడు. రవితేజ తప్పు ఉద్దేశ్యం తో మాట్లాడలేదు , క్యాజువల్ గానే మాట్లాడాడు కానీ , పబ్లిక్ ఈవెంట్స్ లో అంత పెద్ద స్థాయి లో ఉన్న హీరో ఇలాంటి పదాలు వాడడం తప్పు అని అంటున్నారు. నెటిజెన్స్ ఆయన్ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. మరి రవితేజ దీనిపై రాబోయే ఈవెంట్స్ లో వివరణ ఇస్తాడో లేదో చూడాలి. అభిమానులు కూడా కొంతమంది రవితేజ కామెంట్స్ ని తప్పుబడుతున్నారు.
ఎలాంటి నెగెటివిటీ లేకుండా, మంచి హైప్ తో మా రవన్న నుండి ఒక సినిమా రాబోతుందని అనుకుంటే , ఇలా జరిగిందేంటి అని బాధ పడుతున్నారు. మరి రవితేజ చేసిన ఈ కామెంట్స్ సినిమా పై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమా కచ్చితంగా అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తుందని , మీరు చాలా బాగా ఈ చిత్రాన్ని నచ్చుతారని , ఒక కొత్త రవన్న ని మీరంతా ఈ సినిమాలో చూడబోతున్నారు అంటూ రవితేజ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడం ఈ చిత్రం పై ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేపుతోంది.