Viswanath & Sons: తమిళ హీరో సూర్య కి మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు , మన టాలీవుడ్ హీరోలకు ఆడియన్స్ ఎలా అయితే థియేటర్స్ వైపు బారులు తీస్తారో , అలా సూర్య సినిమాలకు కూడా బారులు తీస్తారు. 24, 7th సెన్స్ వంటి చిత్రాలు కమర్షియల్ గా తమిళనాడు లో ఫ్లాప్స్ గా నిలిచాయి. కానీ అవే సినిమాలు మన టాలీవుడ్ లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సందర్భమే ‘విశ్వనాధ్ & సన్స్’ కి ఎదురైంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ , రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు లో కలెక్షన్స్ అదిరిపోయాయి.
కానీ తమిళం లో మాత్రం ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా నిరాశపరుస్తూ వస్తోంది. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి రాష్ట్రాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 28 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ,17 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది. మరో 4 కోట్ల 80 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈరోజు రేపటితో ఈ చిత్రం లాభాల్లోకి రావొచ్చు. ఇక తమిళనాడు వసూళ్ల విషయానికి వస్తే , మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 27 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి తమిళనాడు లో 45 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం కచ్చితంగా రాబట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి లో తమిళనాడు రాష్ట్రం నుండి ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 8 కోట్ల రూపాయిలు , కేరళ నుండి 4 కోట్ల 75 లక్షల రూపాయిలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 5 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి మూడు రోజుల్లో 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ చిత్రం మరో 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.