Venky Atluri: మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఆదరించినట్టుగా , దేశం లో ఏ ఇండస్ట్రీ కి సంబంధించిన ఆడియన్స్ కూడా ఆదరించలేరు అనేది వాస్తవ నిజం. ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలను మన ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తుంటారు. వాళ్ళ సినిమాలకు మన స్టార్ హీరోలతో సమానమైన వసూళ్లను కూడా అందిస్తుంటాము. కానీ వాళ్ళు మాత్రం మన సినిమాలను చూడరు. ఒక్క బాహుబలి సిరీస్ తప్ప , ఈమధ్య కాలం లో తమిళం లో డబ్ అయ్యి , సూపర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలు ఒక్కటి కూడా లేవంటే నమ్ముతారా?.. చివరికి పుష్ప సిరీస్ ని కూడా అక్కడి ఆడియన్స్ ఆదరించలేదు. మన టాలీవుడ్ హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే, వాళ్ళు కనీసం తమిళ హీరోల సినిమాలను కూడా తెలుగు టెక్నీషియన్స్ తో లింక్ అయ్యి ఉంటే ఆదరించడం లేదు.
అందుకు లేటెస్ట్ బెస్ట్ ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన ‘విశ్వనాధ్ & సన్స్’. సూర్య తమిళనాడు లో పెద్ద స్టార్ హీరో. ఆయన గత చిత్రం ‘కరుప్పు’ తమిళనాడు రాష్ట్రం నుండి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రానికి కనీస స్థాయిలో కూడా తమిళనాడు ప్రాంతం లో ఓపెనింగ్స్ దక్కలేదు. తమిళనాడు లో మూడు రోజులకు వచ్చిన గ్రాస్ కంటే , మన తెలుగు రాష్ట్రాల మూడు రోజుల గ్రాస్ ఎక్కువ. మంచి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా తమిళ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎందుకు ఆదరించడం లేదంటే , డైరెక్టర్ మన టాలీవుడ్ కి చెందిన వెంకీ అట్లూరి కాబట్టి. అంతే కాకుండా ఈ సినిమాకు నిర్మాత తెలుగువాడే , నటీనటులు అత్యధిక శాతం తెలుగు వాళ్ళే.
పూర్తిగా తెలుగు సినిమాలాగానే ఇది అక్కడి ఆడియన్స్ కి ప్రొజెక్ట్ అవ్వడం వల్లే , ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. గతం లో కూడా ఇంతే , ధనుష్ , నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ తమిళనాడు లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బాగలేని సినిమాలు ఫ్లాప్ అవ్వడం సహజమే , కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా వాళ్ళు కేవలం తెలుగు డైరెక్టర్స్ తో పని చేసిన కారణంగా ఫ్లాప్ చేస్తే ఏమనుకోవాలి?, అసలు ఎందుకు వీళ్లకు తెలుగు వాళ్లంతా ఇంత పగ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .