Bigg Boss 10 : మరో 20 రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవ్వబోతున్న ‘బిగ్ బాస్ 10’ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే గత సీజన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే అందుకు కారణం. అందుకే బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఈ షో నిన్నటి నుండి టెలికాస్ట్ అవుతోంది. అదే విధంగా సెలబ్రిటీల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళని ఎంచుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి కానీ , పూర్తి స్థాయి సమాచారం కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
ఇకపోతే ‘బిగ్ బాస్ 10’ కి సంబంధించిన మెయిన్ ప్రోమో నిన్ననే విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో లో , ఈ షో థీమ్ ఏంటో చెప్పేశారు. 10 వ సీజన్ కాబట్టి , 10 రకాల కోణాల్లో ఈ షో ని నిర్వహించబోతున్నామనే హింట్ ఇచ్చాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. ఈ ప్రోమో లో ఆయన ఫ్లోరిస్ట్ గా , స్టంట్ మాస్టర్ గా, యాక్షన్ హీరో గా, చెఫ్ మాస్టర్ గా, యాంకర్ గా ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించాడు. అంటే ఈ షో లో ఆయన వారానికి ఒక అవతారం లో ఈ సీజన్ లో కనిపించబోతున్నట్టు ఈ ప్రోమో ని చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే సీజన్ 8 లో కూడా ఇలాంటివి చాలానే చెప్పారు. కానీ చివరికి షో లో పెద్దగా ఏమి కనిపించలేదు. ఇలా ప్రతీ సారి బిల్డప్ ఇచ్చిన సీజన్లు ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
ఇప్పుడు కూడా అలాంటి సీజన్ ని అందించబోతున్నారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ పై సోషల్ మీడియా లో నెగెటివిటీ విపరీతంగా ఏర్పడింది. సామాన్యులుగా ఎన్నో కలలు కానీ ఆడిషన్స్ కోసం వచ్చిన వాళ్ళను జడ్జీలు , యాంకర్ శ్రీముఖి అసలు మనుషులు లాగా కూడా చూడడం లేదని , ఇది చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ బాలు ని అవమానించడం పై చాలా కోపం తో ఉన్నారు నెటిజెన్స్. అతన్ని సెలబ్రిటీ క్యాటగిరీ లో బిగ్ బాస్ హౌస్ లోకి పంపాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.