Homeఎంటర్టైన్మెంట్Rocking Star Yash : అల్లు అరవింద్ తనపై చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్...

Rocking Star Yash : అల్లు అరవింద్ తనపై చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరో యాష్..

Rocking Star Yash : కన్నడ స్టార్ హీరో యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ఈ నెల 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో హీరో యాష్ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఒక అంతర్జాతీయ మీడియా కి ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇన్ని రోజులు తన చుట్టూ జరిగిన అంశాల పై స్పందిస్తూ చాలా హాట్ కామెంట్స్ […]

Rocking Star Yash : కన్నడ స్టార్ హీరో యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ఈ నెల 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో హీరో యాష్ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఒక అంతర్జాతీయ మీడియా కి ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇన్ని రోజులు తన చుట్టూ జరిగిన అంశాల పై స్పందిస్తూ చాలా హాట్ కామెంట్స్ చేసాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రష్మిక గతం లో తనని ‘షో ఆఫ్ హీరో’ అని చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ , ఆమె ఏ ఉద్దేశ్యం తో చెప్పిందో నాకు తెలియదు , ఇంటర్వ్యూ లో ప్రశ్నలు అడిగేటప్పుడు కొంతమంది ఇలాంటి ఛాయస్ లు ఇస్తుంటారు , తప్పనిసరి పరిస్థితి లో ఆమె అలా చెప్పిఉండొచ్చు అంటూ చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు.

అదే విధంగా 2023 వ సంవత్సరం లో మన టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ యాష్ గురించి మాట్లాడుతూ ‘KGF చిత్రానికి ముందు యాష్ గురించి ఎవరికీ తెలుసు?’ అని అంటాడు. ఈ అంశాన్ని యాంకర్ ప్రస్తావించినప్పుడు , యాష్ సమాధానం చెప్తూ ‘కేజీఎఫ్ సిరీస్ వల్ల నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం వాస్తవమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక సినిమా విజయం కేవలం నిర్మాత క్రెడిట్ లోకి వేయడం కరెక్ట్ కాదు. ఆ విజయం వెనుక ఎన్నో వందల మంది కష్టం దాగుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి , రైటర్స్ వరకు అందరూ వళ్ళు వంచి పని చేస్తేనే ఫైనల్ ఔట్పుట్ వస్తుంది. అదే విధంగా ముఖ్య పాత్రలు పోషించే నటీనటులు సరిగా నటించకపోతే , సినిమా హిట్ అవ్వదు. ప్రేక్షకులు దేవుళ్ళు. వాళ్ళ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. ప్రతీ ఒక్కరి శ్రమ ని గుర్తించడమే వారిలోని ప్రత్యేకత’.

‘ఎవరికీ ఎంత గౌరవం ఇవ్వాలో , సక్సెస్ క్రెడిట్ ఎవరిదో వాళ్లకు బాగా తెలుసు. కొన్నిసార్లు హీరో ని మాత్రమే అభిమానులు ఎందుకు ఇంతలా ఇష్టపడతారో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రేక్షకులు తమ తీర్పు ని పర్ఫెక్ట్ గా ఇవ్వడం లో ఎప్పుడూ విఫలం అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యాష్. ప్రతీ శుక్రవారం స్టార్ హీరోల తలరాతలు మారిపోతూ ఉంటాయని, పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ శాశ్వతం కాదు అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper