Viswanath And Sons: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇది ఒక ఫీల్ గుడ్ సినిమాగా మారబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ట్రైలర్ కూడా చాలా డీసెంట్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వెంకీ అట్లూరి గతంలో చేసిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోయింది. అలాగే ఈ సినిమా కూడా అదే మాదిరిగా అదే టెంప్లేట్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అవుతాడు.
లేకపోతే మాత్రం ఆయన ఇమేజ్ కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా కథని వెంకీ అట్లూరి మొదట నాగార్జునకి వినిపించారట. కానీ నాగార్జున అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని చేయలేకపోయినట్టుగా తెలుస్తుంది.
నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమాను చేస్తున్నాడు. దానిమీదనే ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. ఆ బిజీ లో ఉండడం వల్లే ఈ సినిమా చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పడంతో వెంకీ అట్లూరి సూర్యకి ఈ కథను చెప్పి అతనితో సినిమానైతే చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు నాగార్జున కొంతవరకు ఫీలవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం నాగార్జున చాలా వరకు మంచి సినిమాను మిస్ అయ్యానని బాధపడే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి సినిమాలు డిఫరెంట్ స్టైల్ లో సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే అవకాశాలైతే ఉన్నాయి. సూర్య ఈ సంవత్సరం ఇప్పటికే ‘వీరభద్రుడు’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు… ఇక ఈ మూవీతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…