Homeఎంటర్టైన్మెంట్Kavya Maran : కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్.. పెళ్లి చేసుకునేది అతడినే..

Kavya Maran : కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్.. పెళ్లి చేసుకునేది అతడినే..

Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కు వివాహం కుదిరిందా.. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందా.. మనదేశంలో కాకుండా వేరే దేశంలో ఆమె పెళ్లి జరగబోతోందా.. ఈ ప్రశ్నలకు ఔను సమాధానం లభిస్తోంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కు ఏకైక కూతురు కావ్య. అతని వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు కూడా కావ్యనే. కావ్య ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, సన్ ఎఫ్ ఎం వంటి సంస్థలు కొనసాగుతున్నాయి. […]

Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కు వివాహం కుదిరిందా.. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందా.. మనదేశంలో కాకుండా వేరే దేశంలో ఆమె పెళ్లి జరగబోతోందా.. ఈ ప్రశ్నలకు ఔను సమాధానం లభిస్తోంది.

సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కు ఏకైక కూతురు కావ్య. అతని వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు కూడా కావ్యనే. కావ్య ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, సన్ ఎఫ్ ఎం వంటి సంస్థలు కొనసాగుతున్నాయి. సన్ రైజర్స్ కేవలం ఐపిఎల్ లోనే కాకుండా.. ఇతర టి20 ప్రీమియర్ లీగ్లలో కూడా ఆడుతోంది. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో కావ్య జట్టు అనేక పర్యాయాలు విజేతగా నిలిచింది.. తద్వారా తన బ్రాండ్ వాల్యూను ఆమె పెంచుకుంది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కావ్య మైదానంలో సందడి చేస్తూ ఉంటుంది. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.

కావ్య వయసు 30 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఇంతవరకు ఆమె లవ్ లో ఉన్నట్టుగాని.. రిలేషన్ లో ఉన్నట్టుగాని వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు కావ్యకు సంబంధించి కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో ఆమె రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో వీటిని వారు ఖండించినప్పటికీ.. తెర వెనుక చాలా జరుగుతోందని తెలుస్తోంది.. అయితే వీరిద్దరి రిలేషన్ కన్ఫామ్ అని.. కుటుంబ సభ్యులు కూడా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు కుటుంబాల మధ్య కూడా సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కావ్య.. అనిరుద్ వివాహం ఖాయమైనట్టు సమాచారం. నవంబర్ 10న గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరి బంధాన్ని అభివృద్ధి దగ్గర బంధువు.. నటుడు మహేంద్ర కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంతవరకు ఈ వ్యవహారం మీద ఇరువర్గాలు అధికారికంగా ప్రకటన చేయలేదు. అనిరుద్ స్వయాన రజనీకాంత్ సతీమణి లత సోదరుడి కుమారుడు. రజనీకాంత్ నటించిన అనేక చిత్రాలకు అనిరుద్ సంగీత దర్శకత్వం వహించాడు. తెలుగులో కూడా ఇతడికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అప్పట్లో జైలర్ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన నేపథ్యంలో.. కావ్య తండ్రి కళానిధి మారన్ అత్యంత విలువైన కారును అనిరుద్ కు బహుమతిగా ఇచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper