Adarsha Kutumbam: మాటల మాంత్రికుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…’గుంటూరు కారం’ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం వెంకటేష్ ని హీరోగా పెట్టి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ సైతం చేయబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాబోయే సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ ఫుట్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో కూడా ఆయన ఎక్కడ రాజీవ్ పడడం లేదు. ఇక క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే తన టీమ్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం డిఓపిగా రవి కే చంద్రన్ ఉన్నాడు. ఇక అతని ప్లేస్ ని సాహు జాన్ తో రీప్లేస్ చేస్తున్నాడు. అలాగే నవీన్ నూలి వ్యవహరిస్తున్నాడు.
ఇక అతన్ని కూడా మారుస్తూ తన ప్లేసులో ‘శ్రీకర్ ప్రసాద్’ ని తీసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. త్రివిక్రమ్ ఎందుకని వీళ్ళని మారుస్తున్నాడు. తనకు క్వాలిటీలో క్లారిటీ మిస్ అవుతుందా? వాళ్లు బిజీగా ఉండటం వల్ల తిరిగి సినిమాలు వదిలేస్తున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు.
కానీ మొత్తానికైతే త్రివిక్రమ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాననే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. టీమ్ ను మార్చడం వల్ల సినిమా కి ఏదైనా ఇబ్బంది కలగవచ్చా అనే ధోరణిలో కూడా మరికొంతమంది ఆలోచిస్తున్నారు.
సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు కావడం విశేషం…ఇప్పటికే ఈ మూవీ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది… కాబట్టి. బ్యాలెన్స్ వర్క్ సైతం తొందర్లోనే పూర్తి చేసి అక్టోబర్ 9 వ తేదీన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…