HomeతెలంగాణTelangana Hijra Controversy: ఆశీర్వాదమా.. అడ్డగోలు దోపిడీయా.. పెళ్లి ఇంట్లో ‘50 వేల’ కోసం...

Telangana Hijra Controversy: ఆశీర్వాదమా.. అడ్డగోలు దోపిడీయా.. పెళ్లి ఇంట్లో ‘50 వేల’ కోసం హిజ్రాల రచ్చ.. అడ్డుకట్టే లేదా

Telangana Hijra Controversy: గతంలో రైళ్లలో మాత్రమే హిజ్రాలు కనిపించేవారు. ప్రయాణికులనుంచి డబ్బులు వసూలు చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే వీరంగం సృష్టించేవారు. హిజ్రాల తాకిడి పెరిగిపోవడంతో రైల్వే శాఖ అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.. రైల్వే శాఖ ఎంతగా కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రైళ్లను దాటి ఇప్పుడు హిజ్రాలు ఏకంగా గ్రామాల మీద పడుతున్నారు. పెళ్లిళ్లు లేదా ఏదైనా వేడుకలు చేసుకుంటే అక్కడికి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అసభ్యకరమైన పదజాలాన్ని […]

Telangana Hijra Controversy: గతంలో రైళ్లలో మాత్రమే హిజ్రాలు కనిపించేవారు. ప్రయాణికులనుంచి డబ్బులు వసూలు చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే వీరంగం సృష్టించేవారు. హిజ్రాల తాకిడి పెరిగిపోవడంతో రైల్వే శాఖ అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.. రైల్వే శాఖ ఎంతగా కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

రైళ్లను దాటి ఇప్పుడు హిజ్రాలు ఏకంగా గ్రామాల మీద పడుతున్నారు. పెళ్లిళ్లు లేదా ఏదైనా వేడుకలు చేసుకుంటే అక్కడికి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఇంకా రాయడానికి వీలైన దుర్మార్గమైన చేష్టలకు పాల్పడుతున్నారు. హిజ్రాల వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడ్డవారు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఆ హిజ్రాలను గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆయనప్పటికీ హిజ్రాల వ్యవహార శైలి మారిపోవడం లేదు. పైగా ఆశీర్వాదం పేరుతో హిజ్రాలు శుభకార్యాలు జరిగే చోటుకు వస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వీరంగం సృష్టిస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఓ కుటుంబానికి చెందినవారు వివాహం నిర్వహిస్తున్నారు. ఆ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. వేడుక జరిగే ఫంక్షన్ హాల్ వద్దకు హిజ్రాలు వచ్చారు. డబ్బులు డిమాండ్ చేశారు. ఏకంగా 50,000 ఇవ్వాలని కోరారు. దానికి ఆ వివాహం జరిగే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పైగా ఫంక్షన్ హాల్ తలుపు వద్ద కూర్చున్నారు. చివరికి 20000 ఇస్తామని చెబితే హిజ్రాలు ఊరుకోలేదు. బూతులతో రెచ్చిపోయారు. అంతేకాదు మరో 10 మందిని పిలిపించుకొని హంగామా సృష్టించారు. చివరికి 35000 తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు.

“హిజ్రాల దూకుడుకు అడ్డుకట్ట వేసే మార్గం లేదా. తెలంగాణ పోలీసులు వారిని ఏమీ చేయలేరా. ఈ స్థాయిలో ధర్నానికి పాల్పడుతుంటే ఏం చేయాలి.. శుభకార్యాలు జరిపే ఇండ్ల మీద పడుతున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటువంటివారిని ఎలా అడ్డుకోవాలి.. ఎలాంటి చర్యలు చేపడితే ఎటువంటి వారు ఇండ్ల మీదికి రారు.. పోలీసులు ఏమైనా పరిష్కార మార్గం చూపిస్తారా.. ఇటువంటివారు వస్తారేమోనని భయంతో పెళ్లి వేడుకలు కూడా జరుపుకోవడం కష్టంగా ఉందని” ఆ వ్యక్తి వాపోయాడు. మరి హిజ్రాల దూకుడు ఎలా అడ్డుకట్ట వెయ్యాలో తెలంగాణ పోలీసులే ఒక నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper