Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… కెరియర్ మొదట్లోనే స్టార్ హీరోగా అవతరించిన ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం లేదు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.
కాబట్టి అవకాశం దొరికినపుడు సినిమాలను చేస్తున్నాడు. ఇటు ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయాడు. కాబట్టి తన నుంచి ఇక మీదట ఎక్కువగా సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ కి ఒకప్పుడు రాఘవేంద్రరావు అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆయన డైరెక్షన్ లో వచ్చే సినిమాలు బాగా నచ్చేవట. కానీ అతను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం పవన్ కళ్యాణ్ కి రాలేదని చెబుతుంటాడు.
ఇక ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన కథలు బాగుంటాయని అలాగే ఆయన డైరెక్షన్ కూడా చాలా సెన్సిబిలిటీస్ తో కూడుకొని ఉంటుందని అందుకే అతనంటే చాలా ఇష్టమని చెబుతుండటం విశేషం…