Trivikram Srinivas: మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ ను హీరోగా పెట్టి ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య పిల్లలతో జరిగిన ఒక సంఘటనను సభ ముఖంగా చెప్పాడు. తన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదని దాంతో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే తన పూర్తి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశానని పవన్ కళ్యాణ్ సైతం తన పారితోషికాన్ని ఇచ్చేశాడు. దాంతో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఇతరులకు డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారట.
దాంతో ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసినట్టుగా చెప్పాడు. నిజానికి అదే సమయంలో త్రివిక్రమ్ ఒక కొత్త ఇల్లు కడదామని అనుకుంటున్నాడట. అలాంటి సందర్భంలోనే ఇలా జరగడంతో మొత్తానికైతే తన భార్య పిల్లలతో ప్రస్తుతం ఉన్న తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలనే ప్రయత్నం చేశారట. సినిమా ఆడలేదు డబ్బులు వెనక్కి ఇచ్చేశాను.
ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్న కూడా రేపు దాన్ని అమ్మేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుందామా అని అడిగాడట. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరు ప్రస్తుతం మనం ఉంటున్న ఇల్లు కూడా బాగానే ఉంది. ఇందులో కూడా ఉండొచ్చు కొత్త ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా మాట్లాడరట. మొత్తానికైతే త్రివిక్రమ్ కి తన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరకడంతో చాలా హ్యాపీగా అనిపించిందట.
ఆ రోజు తను చాలా సంతోషంగా భోజనం చేసి ఒక సినిమా చూసి పడుకున్నారట… ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని వాటిని ఎదిరించుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే సక్సెస్ లను సాధించగలమంటూ ఆయన ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నమైతే చేశాడు..
Director #Trivikram on failures
Failure is not the end… it’s a lesson that makes you stronger and better. ❤️ pic.twitter.com/OaANJkDoQr
— Milagro Movies (@MilagroMovies) August 25, 2026