Trivikram Srinivas: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ రైటర్లు ఎంతమంది ఉన్నా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత సినిమాల కథల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. కథను ఎలా రాయాలి, కామెడీని ఎలా జనరేట్ చేయాలి, ఒక హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలా మౌల్డ్ చేయాలి అనే విషయాన్ని తనే స్వయంగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులందరికి తెలియజేశాడు. అతనిని చూసిన చాలా మంది అతనిలాగే రేటింగ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇక ఏదేమైనా కూడా స్క్రీన్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కనిపిస్తే చాలు ఒకప్పుడు సినిమాలు చాలా వరకు సక్సెస్ లను సాధించేవి. ఇలాంటి సందర్భంలోనే ఒక ప్రొడ్యూసర్ అతన్ని నెత్తి మీద రెండు మొట్టికాయలు వేశారట. ఇంతకీ ఆయన్ని కొట్టిన ప్రొడ్యూసర్ ఎవరు అంటే స్రవంతి రవి కిషోర్ కావడం విశేషం…కెరియర్ మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అతని బ్యానర్ లోనే ఎక్కువగా కథలను రాశాడు. తను డైరెక్షన్ లో వచ్చిన మొదటి మూవీ అయిన ‘నువ్వే నువ్వే’ సినిమాని కూడా అదే బ్యానర్ తెరకెక్కించాడు.
నువ్వే నువ్వే సినిమా కథ రాస్తున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందులో కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించాలని చూశాడట. కానీ పక్కనే ఉన్న స్రవంతి రవి కిషోర్ గారు త్రివిక్రమ్ నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసి క్యారెక్టరైజేషన్ గురించి ఆలోచించండని చెప్పారట.
అప్పటికి త్రివిక్రమ్ క్యారెక్టర్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నప్పటికి ఏదో అనుకోకుండా కొత్త సీన్స్ రావడంతో వాటిని అందులో పెడదామని అతను అత్యుసహం చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్, కిషోర్ గారి మధ్య మంచి సంబంధాలైతే ఉన్నాయి.
నువ్వే నువ్వే సినిమా రీ రిలీజ్ చేసినప్పుడు త్రివిక్రమ్ స్టేజి మీద స్రవంతి రవి కిషోర్ గారి కాళ్ళు మొక్కడం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఎందుకంటే త్రివిక్రమ్ కి రైటర్ గా మొదటి ఛాన్స్ స్రవంతి రవి కిషోర్ గారు ఇచ్చారు. కాబట్టి త్రివిక్రమ్ ఆ కృతజ్ఞత భావాన్ని మర్చిపోకుండా తనకు రవికిషోర్ కాళ్ళను మొక్కడట. ఇప్పటికి త్రివిక్రమ్ రవి కిషోర్ గారిని గురువుగా భావిస్తుంటాడు…