Homeటాప్ స్టోరీస్AK 47 teaser: ఆదర్శకుటుంబం టీజర్ రివ్యూ : వెంకటేశ్ తో ఇంత చప్పటి కామెడీ...

AK 47 teaser: ఆదర్శకుటుంబం టీజర్ రివ్యూ : వెంకటేశ్ తో ఇంత చప్పటి కామెడీ వండితే వర్కవుట్ అవుతుందా త్రివిక్రమ్?

AK 47 teaser: నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంటి సినిమాలతో వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోకు తెలుచిత్ర పరిశ్రమలో మంచి పేరే ఉంది. తొలిసారిగా వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాతృ సంస్థ లాంటి హారిక హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు ఆదర్శ కుటుంబం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సినిమాకి సంబంధించి పాత్రలను పరిచయం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. మొత్తానికి ఈరోజు […]

AK 47 teaser: నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి వంటి సినిమాలతో వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోకు తెలుచిత్ర పరిశ్రమలో మంచి పేరే ఉంది. తొలిసారిగా వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన మాతృ సంస్థ లాంటి హారిక హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు ఆదర్శ కుటుంబం.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సినిమాకి సంబంధించి పాత్రలను పరిచయం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. మొత్తానికి ఈరోజు టీజర్ ను బయటికి తీసుకొచ్చాడు. తద్వారా వెంకటేష్ అభిమానులకు ఈ సినిమా మీద తిరుగులేని అప్డేట్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే వారిలో ఆనందాన్ని నిప్పుతూ ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

వెంకటేష్ ప్రస్తుతం తిరుగులేని స్పీడ్ లో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కు తోడుగా నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. దానికంటే ముందు అక్టోబర్ 2న ఏకే 47 విడుదల కాబోతోంది.

ఈ సినిమా టీజర్ లో వెంకటేష్ టైమింగ్ తో అదరగొట్టినప్పటికీ.. ఎందుకో అది త్రివిక్రమ్ స్థాయిలో లేదు. సినిమా సోల్ ఇందులో కనిపించలేదు.. భార్య చేసిన అప్పులు.. పిల్లల స్కూల్ ఫీజులు.. ఇతర ఖర్చులు తట్టుకోలేక నలిగిపోయే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా వెంకటేష్ కనిపించాడు. ఆయన ఫ్రస్టేషన్.. బాధ చూస్తే మల్లీశ్వరి సినిమా గుర్తుకొస్తే తప్పు మనది కాదు.. వెంకీ మామ నోటి నుంచి వచ్చిన త్రివిక్రమ్ స్టైల్ డైలాగులు . మిడిల్ క్లాస్ నుంచి ఒక్కసారిగా ధనవంతులుగా మారిపోయిన తర్వాత వెంకటేష్ మేనరిజం.. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ .. మొత్తం గా టీజర్ ను గందరగోళంగా మార్చేశాయి.

డబ్బుకు సబ్బుకు ఒక పోలిక ఉంది. మొదటిది చూస్తుండగానే కరిగిపోతుంది. రెండవది ఆలోచించే లోగానే అరిగిపోద్ది.. ప్రాసతో డైలాగ్ మొదలు పెట్టినప్పటికీ.. టీజర్ త్రివిక్రమ్ సినిమా స్థాయిలో లేదు.. భార్య చేసే అప్పును.. వెంకటేష్ చేసే పప్పును కలుపుతూ రాసిన డైలాగ్ కాస్త నవ్వు తెప్పించినప్పటికీ.. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత సినిమాలనే గుర్తుకు తెస్తుంది. చివర్లో నది.. సముద్రం.. సామాన్యుడి ఆగ్రహాన్ని కలుపుతూ రాసిన డైలాగ్ కూడా త్రివిక్రమ్ స్థాయిని చూపించలేకపోయింది.. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి.. నారా రోహిత్.. నివేద పేతురాజు.. యువిన వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ నటిస్తున్నారని చెప్పినప్పటికీ.. టీజర్ లో ఆయన ముఖాన్ని చూపించలేదు. ఈ టీజర్ లో ఉన్న లోపాలలో అది కూడా ఒకటి.

ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ రొటీన్ రొడ్డ కొట్టుడు కామెడీతో వెంకటేష్ లాంటి నటుడికి హిట్ ఇస్తానని త్రివిక్రమ్ ఎలా అనుకున్నాడో తెలియడం లేదు. గతంలో గుంటూరు కారం సినిమా టీజర్ కూడా అంతగా ఇంఫాక్ట్ చూపించలేదు. ఫలితంగా భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చేతిలో రాజమౌళి సినిమా ఉంది కాబట్టి మహేష్ బాబుకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఆ సినిమా ఇచ్చిన రాడ్ రంబోలా ఫలితం ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రెండు సంవత్సరాలు విరామం తీసుకునేలా చేసింది. ఇంతటి గ్యాప్ దొరికినప్పుడు త్రివిక్రమ్ కథ మీద కసరత్తు చేసి ఉంటే బాగుండేది. తన పాత సినిమాల మాదిరిగా కాకుండా.. కొత్తదనాన్ని చూపించి ఉంటే మరింత బాగుండేది. ఈ రోజుల్లో ప్రాస డైలాగులు చాలామంది రాస్తున్నారు. ఒకప్పుడు త్రివిక్రమ్ ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. కానీ ఇప్పటికీ దాన్నే పట్టుకుని వేలాడితే జనాలకు పెద్దగా మజా రాదు. ఈ రోజుల్లో సినిమాలో దమ్ము లేకపోతే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ టాక్సిక్ ఫలితం మనం చూస్తూనే ఉన్నాం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper