Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ లో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత తుఫాన్ గా మారిన రోహిత్ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు అన్ని రకాల అర్హతలు సాధించి, ఆడియన్స్ ఓటింగ్ తో హౌస్ లోకి భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన రోహిత్, ఆ అంచనాలను అందుకోవడం లో మొదటి రోజు నుండే సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా హౌస్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ ని టార్గెట్ చేయడం తో , ఒక్కసారిగా రోహిత్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఓటింగ్ లో రోహిత్ కి 50 శాతం పడుతుంటే, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలిపి 50 శాతం ఓటింగ్ నమోదు అవ్వుతోంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో టాస్క్ ని మీరంతా చూసే ఉంటారు.
ఈ టాస్క్ లో రోహిత్ టీం ఓడిపోగా , రామ్ ప్రసాద్ టీం గెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కి కెమెరా ముందు జరిగిన తప్పులన్నీ చూపించి , ఎవరు విన్నర్ అనేది చెప్పే ప్రయత్నం చేసాడు రోహిత్. దీంతో బిగ్ బాస్ రోహిత్ చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని , టాస్క్ ని రోహిత్ టీం పర్ఫెక్ట్ గా పూర్తి చేసారని , ఈ టాస్క్ లో విన్ అయ్యింది రోహిత్ టీం అని అంటాడు బిగ్ బాస్. దీంతో మరోసారి రోహిత్ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోయింది. ఈ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ అవుతుందా?, లేదా రేపు టెలికాస్ట్ అవుతుందా అనేది చూడాలి. కానీ రోహిత్ మాత్రం మరోసారి టీం లీడర్ గా తన మార్క్ ని చూపించాడు. ఇదే రేంజ్ లో ఆయన రాబోయే రోజుల్లో ముందుకు దూసుకెళ్తే కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరూ రోహిత్ నామస్మరణం చేస్తున్నారు. మరి వీకెండ్ లో నాగార్జున సెలబ్రిటీలకు కోటింగ్ ఇస్తాడా?, లేదా రివెర్స్ లో రోహిత్ కి కోటింగ్ ఇస్తాడా?. ఒకవేళ రోహిత్ కి కోటింగ్ ఇస్తే మాత్రం అతని పై జనాల్లో సానుభూతి మామూలు రేంజ్ లో పెరగదు అనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, రోహిత్ ని విన్నర్ అవ్వకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.