HomeజాతీయంGold Price Crash: బంగారం ధరల పతనం.. ఇకపై ఆ వ్యాపారానికి కష్ట కాలమేనా..

Gold Price Crash: బంగారం ధరల పతనం.. ఇకపై ఆ వ్యాపారానికి కష్ట కాలమేనా..

Gold Price Crash:బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు సామాన్యులకు ఒకవైపు కొనుగోలు భారంగా మారితే.. మరోవైపు ఆ కంపెనీలకు మాత్రం వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది. బంగారం విలువ పెరగడంతో పసిడిని తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఒకసారి గా మారుతోంది. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆ కంపెనీలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ప్రముఖ సంస్థల షేర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. మరి బంగారం […]

Gold Price Crash:బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు సామాన్యులకు ఒకవైపు కొనుగోలు భారంగా మారితే.. మరోవైపు ఆ కంపెనీలకు మాత్రం వ్యాపారం బ్రహ్మాండంగా సాగింది. బంగారం విలువ పెరగడంతో పసిడిని తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఒకసారి గా మారుతోంది. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఆ కంపెనీలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ప్రముఖ సంస్థల షేర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. మరి బంగారం ధరల పతనం ఆ కంపెనీలను ఎందుకు కలవరపెడుతోంది.. ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం..

ఈ సంవత్సరం మొదట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ.. దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. దీంతో బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వాటి గరిష్ట స్థాయి నుంచి దాదాపు 30 శాతం వరకు ప్రస్తుతం తగ్గుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో సుమారు 15% పతనం నమోదు అయింది. అమెరికాలో డాలర్ బలపడడం.. బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. మార్కెట్లో పెట్టుబడిదరుల లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా బంగారం ధర తగ్గుతోంది.

బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్ కంపెనీలు కస్టమర్ల నుంచి బంగారాన్ని పసిడిని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టి ఏడు లక్షల రుణం తీసుకున్నాడని అనుకుంటే.. ఇప్పుడు బంగారం ధరలు తగ్గి తాకట్టు పెట్టిన బంగారం విలువ ఎనిమిది లక్షలకు పడిపోయిందనుకుందాం. ఇప్పుడు అదే రుణం విలువ బంగారం ప్రస్తుతం మార్కెట్ విలువతో పోలిస్తే ఎక్కువగా మారుతుంది. దీనినే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి పెరగడం అంటారు. అంటే రుణం ఇచ్చిన కంపెనీకి తాకట్టులో ఉన్న బంగారంపై భద్రత తగ్గుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు అధికరణాలు తీసుకున్న కస్టమర్ల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్ కంపెనీలకు మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. లోన్లు తీసుకున్న కొంత మంది కస్టమర్లు వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నారు. మరికొందరు పాత రుణాలను రెన్యువల్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన రుణాలను వసూలు చేసుకోవడానికి తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయాల్సిన పరిస్థితులు పెరగవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ త్రైమాసికంలో బంగారం వేలం ప్రక్రియలు పెరిగే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ విభాగం పర్యవేక్షించే ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన కథనంలో కూడా మణప్పురం ఫైనాన్స్ విభాగాన్ని పర్యవేక్షించే అధికారి కూడా ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ త్రైమాసికంలో 120 నుంచి 130 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేయాల్సి రావచ్చని ఆ సంస్థ ప్రతినిధి అంచనా వేశారు. గత డిసెంబర్ త్రైమాసికంలో వేలం వేసిన బంగారం విలువ దాదాపు 100 కోట్లుగా ఉంది.

బంగారం ధరల పతనం గోల్డ్ లోన్ కంపెనీల స్టాక్ మార్కెట్ పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. నవంబర్ 18న ముత్తూట్ ఫైనాన్స్.. Manappuram ఫైనాన్స్ షేర్లు దాదాపు నాలుగు శాతం చొప్పున పడిపోయాయి. బంగారం ధరలు తగ్గితే తాకట్టు ఆస్తుల విలువ తగ్గుతుంది. రుణాల భద్రతపై ఒత్తిడి పెరుగుతుంది. రుణాల చెల్లింపుల్లో ఆలస్యాలు పెరిగిపోతే కంపెనీల ఆస్తుల విలువ కూడా తగ్గుతుంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

బంగారం ధరలు తగ్గడం వల్ల గోల్డ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే సమస్యలు రాకపోయినప్పటికీ.. అధిక లోన్ టు వాల్యూ నిష్పత్తిలో రుణాలు తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో రుణ దాతలు అదనపు బంగారం తాకట్టు పెట్టాలని లేదా కొంత రుణాన్ని తిరిగి చెల్లించాలని కోరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుల్లెట్ రీపేమెంట్ విధానంలో రుణాలు తీసుకున్న వారు గడువు తేదీ.. వడ్డీ చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రుణ ఒప్పంద నిబంధనలు కూడా పరిశీలించాలి.

బంగారం ధరలు తగినంత మాత్రాన గోల్డ్ లోన్ కంపెనీలు భారీ నష్టాల్లోకి వేద్దాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ రంగంలో చాలా సంస్థలు బంగారం విలువలో కొంత మార్జిన్ ఉంచుకొని రుణాలు ఇస్తుంటాయి. క్రిసీల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం చాలా గోల్డ్ లోన్ సంస్థలు 65 నుంచి 75 శాతం ఎల్ టి వి నిష్పత్తులను పాటిస్తుంటాయి. దీంతో ధరల పతనాన్ని తట్టుకునే భద్రత కొంతమేరకు ఉంటుంది. బంగారం ధరలు మరింత తగ్గితే.. అదే సమయంలో రుణాల చెల్లింపుల్లోనూ ఇబ్బందులు పెరిగితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారవచ్చు. మొత్తంగా చూస్తే ధరల పెరుగుదలతో భారీగా వ్యాపారం చేసిన గోల్డ్ లోన్ కంపెనీలకు ఇప్పుడు ధరల పతనం కొత్త సవాలుగా మారింది. తాకట్టు బంగారం విలువ తగ్గడం.. రుణాల చెల్లింపుల్లో జాప్యం.. వేలం ప్రక్రియలు పెరిగే అవకాశం అంటే అంశాలు ఈ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. వచ్చే డిసెంబర్ త్రైమాసికంలో ఈ పరిణామాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper