Homeబిజినెస్Maruti Fronx: క్రెటా, ఆల్టోస్ ఖేల్ ఖతం..ఈ కారు జోరు మాములుగా లేదు..లీటర్ పెట్రోల్ కు...

Maruti Fronx: క్రెటా, ఆల్టోస్ ఖేల్ ఖతం..ఈ కారు జోరు మాములుగా లేదు..లీటర్ పెట్రోల్ కు 39కి.మీ మైలేజ్ మరి

Maruti Fronx: కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి మారుతి సుజుకి మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ప్రాంక్స్ అనే మోడల్ కారును సరికొత్త హంగులతో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కాదు ఫేస్ లిఫ్ట్ మోడల్ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీంతో కొత్త ఫ్రాంక్స్ ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయని ఆసక్తి అందరిలో మొదలైంది. ముఖ్యంగా ఏడిఏఎస్ టెక్నాలజీ. కొత్త ఇంజన్.. మెరుగైన మైలేజీ […]

Maruti Fronx: కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి మారుతి సుజుకి మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ప్రాంక్స్ అనే మోడల్ కారును సరికొత్త హంగులతో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కాదు ఫేస్ లిఫ్ట్ మోడల్ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీంతో కొత్త ఫ్రాంక్స్ ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయని ఆసక్తి అందరిలో మొదలైంది. ముఖ్యంగా ఏడిఏఎస్ టెక్నాలజీ. కొత్త ఇంజన్.. మెరుగైన మైలేజీ వంటి అంశాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

కొత్త డిజైన్ తో..

టెస్టింగ్ సమయంలో కనిపించిన ఫ్రాంక్స్ ఫేస్ లిఫ్ట్ లో ముందు భాగంలో మార్పులు కనిపించాయి. కొత్త గ్రిల్.. మారిన బంపర్ డిజైన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత మోడల్ లో ఉన్న స్ప్లిట్ హెడ్ లాంప్ డిజైన్.. కూపే తరహా రూప్ లైన్ ను కొనసాగించే అవకాశం ఉంది. వెనుక భాగంలో బంపర్.. లైటింగ్ భాగాల్లో స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి. మొత్తంగా ప్రస్తుత ఫ్రాంక్స్ కు భిన్నంగా మరింత ఆధునిక లుక్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఏడీఏఎస్ టెక్నాలజీ

ఫ్రాంక్స్ కొత్త రూపం అందరినీ ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఏడీఏఎస్ టెక్నాలజీ ద్వారా టెస్టింగ్ లో కనిపించిన కారులో ఫ్రంట్ గ్రిల్ మధ్యలో రాడార్ సెన్సార్ తరహా పరికరం ఉంది. దీంతో లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్.. లేన్ కీపింగ్ అసిస్ట్..లైన్ డిపార్చర్ వార్నింగ్.. ఆటోమెటిక్ హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.. టెస్టింగ్ కార్లో వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్రాంక్స్ మోడల్ కార్లలో వెనుకవైపు డ్రమ్ము బ్రేకులు మాత్రమే ఉన్నాయి.

ఇక ఈ మోడల్ నుంచి వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వార్త హైబ్రిడ్ ఇంజన్.. మారుతి సుజుకి తన సొంత హైబ్రిడ్ టెక్నాలజీని ఈ కారు ఇంజన్ లో ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంధన సామర్థ్యం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లీటర్ పెట్రోల్ కు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిని ఇంతవరకు మారుతి సుజుకి అధికారికంగా ధ్రువీకరించలేదు..

ఫ్రాంక్స్ ఫేస్ లిఫ్ట్ లో ఇంజన్ పరంగా కూడా కీలక మార్పులు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ స్థానంలో, కొత్త 1.2 లీటర్ Z12E మూడు సిలిండర్ల ఇంజన్ ను తీసుకొచ్చే అవకాశం. ఈ ఇంజన్ సుమారుగా 83 పీఎస్ పవర్, 123 Nm టార్క్ ను ఉత్పత్తి చేనుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్.. ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.0 లీటర్ బూస్టర్ జెడ్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా కొనసాగే అవకాశం ఉంది.

కొత్త ఫ్రాంక్స్ ఫీచర్లలో భాగంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. అప్ గ్రేడ్ చేసిన సౌండ్ సిస్టం.. కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. సన్ రూఫ్ విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. మారుతి ఫ్రాంక్స్ ఫేస్ లిఫ్ట్ 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2027 భారత్ మొబిలిటీ ఎక్స్ పో లో కూడా ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫ్రాంక్స్ ధర సుమారు 6.90 లక్షల నుంచి 12.3 లక్షల వరకు ఉంది. కొత్త మోడల్ లో ఫీచర్లు పెరిగితే ధరలో కూడా మార్పులు ఉండవచ్చు.

ఫ్రాంక్స్ మార్కెట్లోకి వస్తే టయోటా అర్బన్ క్రూజర్ టైసర్.. నిస్సాన్ మ్యాగ్నైట్.. రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మెరుగైన మైలేజీ.. ఏడీఏఎస్.. కొత్త ఫీచర్లతో వస్తే ఈ సెగ్మెంట్లో మారుతి ఫ్రాంక్స్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి 35 కిలోమీటర్ల మైలేజీ.. ఏడీఎస్.. హైబ్రిడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో మార్కెట్లోకి ఫ్రాంక్స్ కొత్తగా వస్తున్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper