Homeబాలీవుడ్Kiyara Advani: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. ఇది ఊహించలేదు..

Kiyara Advani: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. ఇది ఊహించలేదు..

Kiyara Advani: భరత్ అనే నేను.. వినయ విధేయ రామ.. టాక్సిక్ వంటి చిత్రాల్లో నటించింది బాలీవుడ్ నటి కియారా అద్వానీ. బాలీవుడ్ లో ఈమెకు మంచి పేరుంది. పైగా మోడల్ కూడా. కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే కియారా సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. 2023లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప. ఇప్పుడు కియారా దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వీరిద్దరూ తమ […]

Kiyara Advani: భరత్ అనే నేను.. వినయ విధేయ రామ.. టాక్సిక్ వంటి చిత్రాల్లో నటించింది బాలీవుడ్ నటి కియారా అద్వానీ. బాలీవుడ్ లో ఈమెకు మంచి పేరుంది. పైగా మోడల్ కూడా. కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే కియారా సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. 2023లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప.

ఇప్పుడు కియారా దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వీరిద్దరూ తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. తమ కుమార్తె సరాయా తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2023లో వివాహం చేసుకున్న వాటి నుంచి కియారా దంపతుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ జోడికి బాలీవుడ్ లోనే కాకుండా.. ఇతర పరిశ్రమలో కూడా మంచి పేరు ఉంది. రెండోసారి తాము ఇద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామని మీరు చెప్పడంతో శుభాకాంక్షలు వెల్లువలాగా వస్తున్నాయి. తన మొదటి కుమార్తె సరాయాతో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ లభిస్తోంది. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి. అధికారికంగా కుటుంబం లేదా వారి ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ఆధారంగానే ఈ విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

కియారా, సిద్ధార్థ ప్రేమయాణం బాలీవుడ్లో చాలా రోజులపాటు హాట్ టాపిక్ లాగా నిలిచింది. చివరికి 2023లో రాజస్థాన్లోని జై సల్మీర్ ప్రాంతంలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అప్పటినుంచి వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని వీలైనంతవరకు ప్రైవేట్ గా ఉంచుతూ వస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కియారా బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో వరుసగా నటించింది. సిద్ధార్థ కూడా భిన్నమైన కదిలించుకుంటూ తన కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల టాక్సిక్ చిత్రంలో కియారా యష్ కు జోడిగా నటించింది. ఇందులో ఆమె సన్నివేశాలు చర్చకు దారి తీసాయి. కియారా ఇలా కనిపిస్తుందని అభిమానులు ఎవరూ ఊహించలేదు. అందాల ఆరబోత చేసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మరోవైపు ఈ సినిమాలో కియారా పాత్రపై అనేక రకాల విమర్శలు వచ్చాయి.అయినప్పటికీ వాటిని ఆమె పట్టించుకోలేదు. కాకపోతే కియారా చేతిలో ప్రస్తుతం ప్రాజెక్టులు లేవు. గర్భవతి కాబట్టి సినిమాలకు విరామం ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా కియారాకు మంచి గుర్తింపు వచ్చింది. వినయ విధేయ రామ సినిమాలో కూడా ఆమె పాత్ర బాగానే ఉన్నప్పటికీ కథలో దమ్ము లేకపోవడంతో గుర్తింపురాలేదు. చివరికి గేమ్ ఛేంజర్ లో కూడా ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper