Homeబిజినెస్Credit Score : ఇలా చేస్తే క్రెడిట్ స్కోరు హై.. ఏకంగా హోమ్ లోన్ వడ్డీలో...

Credit Score : ఇలా చేస్తే క్రెడిట్ స్కోరు హై.. ఏకంగా హోమ్ లోన్ వడ్డీలో 38 లక్షలు ఆదా..

Credit Score: సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లేదా ప్లాటు కొనుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. దీనికోసం తమ జీవితకాల సంపాదనను పెట్టుబడిగా పెడుతుంటారు. సరిపోకపోతే బ్యాంకులో నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఇల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు చాలామంది ఇంటి ధర.. డౌన్ పేమెంట్.. ఈఎంఐ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. అదే క్రెడిట్ స్కోర్. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే తక్కువ వడ్డీకి హోమ్ లోన్ పొందడానికి అవకాశం […]

Credit Score: సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లేదా ప్లాటు కొనుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. దీనికోసం తమ జీవితకాల సంపాదనను పెట్టుబడిగా పెడుతుంటారు. సరిపోకపోతే బ్యాంకులో నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఇల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు చాలామంది ఇంటి ధర.. డౌన్ పేమెంట్.. ఈఎంఐ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. అదే క్రెడిట్ స్కోర్.

మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే తక్కువ వడ్డీకి హోమ్ లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ చిన్న వడ్డీ వ్యత్యాసమే లక్షల రూపాయల భారంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో 38 లక్షల వరకు వడ్డీ ఆదా చేసే అవకాశం కూడా ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి గతంలో తీసుకున్న రుణాలు.. క్రెడిట్ కార్డుల వినియోగం.. ఈఎంఐ చెలింపుల తీరును బట్టి రూపొందించే మూడు అంకెల సంఖ్య. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించారా.. క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లించారా.. ఇప్పటికీ ఎన్ని రుణాలు తీసుకున్నారు…. క్రెడిట్ కార్డు పరిమితిని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు.. ఇలాంటి అంశాలు మీ స్కోర్ మీద ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచి క్రెడిట్ ప్రొఫైల్ లాగా పరిగణిస్తారు. అయితే ఒక్కో బ్యాంకు రుణ అర్హత ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి.

ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 1.5 కోట్ల హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. లోన్ కాల పరిమితి 30 సంవత్సరాలు. బ్యాంకు అతడికి 9% వడ్డీకి రుణం ఇచ్చింది అనుకుందాం. అదే మంచి క్రెడిట్ స్కోర్ కారణంగా మరో వ్యక్తికి 8% వడ్డీకి రుణం లభించింది అనుకుందాం.. ఇప్పుడు 1.5 కోట్ల రుణానికి 9 శాతం వడ్డీ అనుకుంటే.. దాని కాలపరిమితి 30 ఏళ్ళు అనుకుంటే.. నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ 1,20,693 రూపాయలు. మొత్తం వడ్డీ 2.85 కోట్ల వరకు ఉంటుంది. ఒకవేళ అదే 1.5 కోట్ల మీద 8% వడ్డీ కనక విధిస్తే.. కాల పరిమితి 30 ఏళ్లు గనక ఉంటే.. నెలవారి ఈఎంఐ 1,10,065 ఉంటుంది. మొత్తం వడ్డీ 2.46 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రకారం వడ్డీ ఆదా అయ్యే మొత్తం 38.26 లక్షలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వడ్డీ రేటులో కేవలం ఒక శాతం వ్యత్యాసం ఉన్నప్పటికీ.. 30 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపు 38 లక్షల అదనపు భారం పడుతుంది. నెలవారి ఈఎంఐ లో కూడా సుమారు 10,628 రూపాయలు తేడా ఉంటుంది. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరచుకోవడం ఎంతో ముఖ్యం.

ఈఎంఐ లు గడువులోగా చెల్లించాలి. క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా ఉపయోగించకూడదు. ఒకేసారి ఎక్కువ లోన్లకు దరఖాస్తు చేసుకోవద్దు. పాత క్రెడిట్ కార్డులను వెంటనే క్లోజ్ చేయకూడదు. క్రెడిట్ రిపోర్టును తరచుగా పరిశీలించాలి. గ్యారెంటీ ఉన్న రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హోమ్ లోన్ తీసుకునే ముందు కనీసం 750 పైగా సిబిల్ స్కోర్ ఉండేలా చూసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులలో వడ్డీ రేట్లు పోల్చుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజులు.. ఇతర చార్జీలు కూడా పరిశీలించాలి. ఇప్పటికే హోం లోన్ ఉంటే వడ్డీ రేట్లు తగ్గించుకునే అవకాశం గురించి బ్యాంకు ప్రతినిధులను అడగాలి. వీలైనప్పుడు అదనపు చెల్లింపులు చేసి అసలు రుణాన్ని తగ్గించుకోవాలి. సిబిల్ స్కోర్ గొప్పగా ఉన్నంత మాత్రాన తక్కువ వడ్డీ సాధ్యం కాదు. ఆదాయం.. ఉద్యోగ స్థిరత్వం.. రుణభారం.. ఆస్తి వివరాలు.. వంటి అంశాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper