Homeఎడ్యుకేషన్Union Bank education loan: ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి యూనియన్ బ్యాంక్ గుడ్ న్యూస్..

Union Bank education loan: ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి యూనియన్ బ్యాంక్ గుడ్ న్యూస్..

Union Bank education loan: ఉన్నత చదువులు చదవాలనే ఆశ వున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో చాలామంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. అలాంటివారికి బ్యాంకులు అందించే విద్యా రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా విద్యార్థులకు వివిధ పథకాల కింద ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తోంది. దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించాలన్నా.. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. అర్హతలను బట్టి రుణం తీసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ ఎంత యూనియన్ […]

Union Bank education loan: ఉన్నత చదువులు చదవాలనే ఆశ వున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో చాలామంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. అలాంటివారికి బ్యాంకులు అందించే విద్యా రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా విద్యార్థులకు వివిధ పథకాల కింద ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తోంది. దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించాలన్నా.. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. అర్హతలను బట్టి రుణం తీసుకోవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ ఎంత

యూనియన్ బ్యాంకు విద్యా రుణాలపై వడ్డీ రేటు ఒకే విధంగా ఉండదు. విద్యార్థి ఎంచుకున్న కోర్సు.. విద్యాసంస్థ.. లోన్ మొత్తం.. పూచికత్తు వంటి అంశాల ఆధారంగా మారుతూ ఉంటుంది. 2026 సెప్టెంబర్ త్రైమాసికానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వడ్డీ రేటు సుమారు 7.10 శాతం నుంచి 10 శాతం వరకు ఉంది. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకు నుంచి తాజా వడ్డీ రేటును విద్యార్థులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

ఎంత లోన్ తీసుకోవచ్చు

విద్యార్థుల కోర్సు, అవసరాలను బట్టి లోన్ మొత్తాన్ని బ్యాంకు నిర్ణయిస్తుంది. ట్యూషన్ ఫీజు.. హాస్టల్ ఖర్చులు.. పరీక్ష ఫీజులు.. పుస్తకాలు.. అవసరమైన విద్యా పరికరాలను ఖర్చులకు లోన్ ఉపయోగపడుతుంది కొన్ని అర్హత కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పూచికత్తు లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందే అవకాశం ఉంటుంది.

వడ్డీ రాయితీ కూడా పొందొచ్చు

కేంద్ర ప్రభుత్వ విద్యా రుణ వడ్డీ రాయితీ పథకాల కింద అర్హులైన విద్యార్థులకు ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ వార్షికాదాయం 4.5 లక్షల లోపు ఉన్న అర్హులైన విద్యార్థులకు పూర్తి వడ్డీ రాయితీ లభించే అవకాశం ఉంది. 4.5 లక్షల నుంచి 8 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్న అర్హులకు 10 లక్షల వరకు రుణంపై మూడు శాతం వడ్డీ రాయితీ అందించే పథకం ఉంది.

తిరిగి ఎలా చెల్లించాలి

సాధారణంగా కోర్సు పూర్తి అయిన తర్వాత ఒక సంవత్సరం మారటోరియం అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రుణాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. అర్హతలు.. రుణ పథకం ఆధారంగా గరిష్టంగా 15 సంవత్సరాల వరకు చెల్లించడానికి గడువు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

విద్యార్థులు యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించాలి. లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. అడ్మిషన్ లెటర్.. ఫీజు వివరాలు.. విద్యార్థి గుర్తింపు పత్రాలు.. తల్లిదండ్రుల ఆదాయ దృవీకరణ పత్రాలు.. అవసరమైన ఇతర డాక్యుమెంట్లను సమర్పించాలి. ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం కోరుకునే విద్యార్థులు రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు.. మారటోరియం.. ఈఎంఐ తిరిగి చెల్లింపు వంటి నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి.

4.5 లక్షలు ఆదాయం ఉంటే పూర్తి వడ్డీ రాయితీ

కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల వరకు ఉండి.. అర్హత కలిగిన సంస్థల్లో ఆమోదిత సాంకేతిక లేదా వృత్తివిద్య కోర్సులు చదివే విద్యార్థులకు PM – USP CSIS పథకం కింద పదిలక్షల వరకు విద్య రుణంపై కోర్స్ కాలం.. ఆ తర్వాత ఒక సంవత్సరం మారటోరియం సమయంలో పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల వరకు ఉన్న అర్హులైన విద్యార్థులకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కింద పది లక్షల వరకు  రుణం మీద మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ ప్రయోజనం కోసం ప్రతి సంవత్సరం గరిష్టంగా లక్ష మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. విద్యార్థులు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూనియన్ బ్యాంకు శాఖను కూడా సంప్రదించవచ్చు. రుణం తిరిగి చెల్లించే గడువు మారటోరియం తర్వాత గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper