Homeటాప్ స్టోరీస్Charmi: చార్మి కన్నీళ్ల వెనక కోట్ల కథ.. పూరి టీం పై చైతన్య రెడ్డి సంచలన...

Charmi: చార్మి కన్నీళ్ల వెనక కోట్ల కథ.. పూరి టీం పై చైతన్య రెడ్డి సంచలన ఆరోపణలు..

Charmi: నిర్మాత చైతన్య రెడ్డి ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమె బయటికి కనిపించేంత సాఫ్ట్ కాదని.. ఆమె మహానటి అని ఆరోపించారు. అంతేకాదు డబ్బులు ఇస్మార్ట్ సినిమా డిస్ట్రిబ్యూషన్.. ఆర్థిక నష్టాలు.. పూరి జగన్నాథ్.. చార్మి వ్యవహారాల గురించి ఆమె కీలక విషయాలను బయటపెట్టారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్మాత చైతన్య రెడ్డి 25 కోట్లు చెల్లించారు. ఈ సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాథ్ […]

Charmi: నిర్మాత చైతన్య రెడ్డి ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమె బయటికి కనిపించేంత సాఫ్ట్ కాదని.. ఆమె మహానటి అని ఆరోపించారు. అంతేకాదు డబ్బులు ఇస్మార్ట్ సినిమా డిస్ట్రిబ్యూషన్.. ఆర్థిక నష్టాలు.. పూరి జగన్నాథ్.. చార్మి వ్యవహారాల గురించి ఆమె కీలక విషయాలను బయటపెట్టారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్మాత చైతన్య రెడ్డి 25 కోట్లు చెల్లించారు. ఈ సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాథ్ గత సినిమాలకు సంబంధించిన వివాదాలు.. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ఇబ్బందిగా మారుతాయి అని చైతన్య రెడ్డికి హెచ్చరికలు వచ్చాయి. ఒక దశలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. ఆ సమయంలో చార్మి చైతన్య రెడ్డి వద్దకు వచ్చారు. డిస్ట్రిబ్యూషన్ మిషన్లో వెనక్కి వెళ్లొద్దని.. అలా చేస్తే చావే గతి అనే స్థాయిలో చైతన్య రెడ్డిని వేడుకున్నారు. అయితే దీనిపై ఇంతవరకు చార్మి స్పందించలేదు.

చైతన్య రెడ్డిని ఆమె భర్త, నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ఈ విషయంలో ఒప్పించి.. మిగిలిన డబ్బు కట్టే విధంగా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. దీంతో చైతన్య రెడ్డికి భారీగా ఆర్థిక నష్టం వచ్చింది. డబ్బు రికవరీ విషయంలో పూరి ఎంటర్టైన్మెంట్స్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఆ తర్వాత ఒక చిన్న సినిమా చేయాలని చేతనే రెడ్డి పూరిని అడిగితే.. తనకు 10 కోట్లు పారితోషికం ఇవ్వాలని.. సినిమాలో వాటా కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చైతన్య రెడ్డి వర్సెస్ చార్మి వివాదంగా ఈ వ్యవహారం ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అసలు విషయం లోతుల్లోకి వెళ్తే ఇది వ్యక్తిగత గొడవ కంటే డబుల్ ఇస్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ డీల్, ఆర్థిక నష్టాలు, ఒప్పందాలు, సినిమా విడుదల సమయంలో ఏదైనా సమస్యల చుట్టూ కేంద్రీకృతమైన వివాదన్నగా కనిపిస్తోంది.

వివాదం ఎలా మొదలైంది అంటే

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కింది. 2024 ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్.. చార్మి కౌర్ నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కు చెందిన నిరంజన్ రెడ్డి.. చైతన్య రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం దాదాపు 25 కోట్లు చెల్లించారు. మొదటి భాగం ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి వసూలు సాధించడంతో.. సీక్వెల్ మంచి బిజినెస్ చేస్తుందని అంచనా తో చైతన్య రెడ్డి ఈ స్థాయిలో డబ్బు చెల్లించారు. సినిమా డీల్ విషయంలో కొన్ని షరతులు పెట్టుకున్నారు. సినిమా క్వాలిటీ విషయంలో సమస్య వస్తే లేదా పూరి జగన్నాథ్ గత సినిమాలకు సంబంధించిన వివాదాలు వంటివి అడ్డంకిగా మారిపోతే తక్కువ నష్టంతో ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేలాగా ఎగ్జిట్ క్లాజ్ పెట్టుకున్నారు.

ప్రాజెక్టు నుంచి బయటికి రావాలని అనుకున్నారు

సినిమా విడుదలకు ముందే పూరి జగన్నాథ్ గత సినిమా వ్యవహారానికి సంబంధించిన వివాదం డబుల్ ఇస్మార్ట్ విడుదల మీద ప్రభావం చూపించింది. దీంతో అప్పటికే చెల్లించిన డబ్బును వదులుకొని ప్రాజెక్టు నుంచి బయటికి రావాలని చైతన్య రెడ్డి అనుకున్నారు. ఆ సమయంలో చార్మి చైతన్య రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు నుంచి తప్పుకోవద్దని కోరారు. ఆ సమయంలో వెనక్కి వెళ్తే పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుందని చార్మి చైతన్య రెడ్డితో చెప్పారు. వాస్తవానికి ఈ మాటలు చైతన్య రెడ్డి చెప్పినవి మాత్రమే. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకోవాలని భావించినప్పటికీ తన భర్త నిరంజన్ రెడ్డి కూడా మరో విధంగా ఒప్పించారని చైతన్య రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పేపర్ల కంటే మనుషులను నమ్మాలని

పేపర్ల కంటే మనుషులను నమ్మాలని.. తాము మరో సినిమా చేస్తామని పూరి బృందం చెప్పడంతో చైతన్య రెడ్డి మిగతా మొత్తాన్ని కూడా చెల్లించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఫైనాన్స్ షేర్ ల నుంచి అనుమతులు తీసుకోవడం.. క్యూబ్ డిజిటల్ ప్రింట్లకు అనుమతి పొందడం వంటి విషయాల్లో కూడా చైతన్య రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా అనుకున్న స్థాయిలో సినిమా ప్రమోషన్ జరగలేదు. విడుదల రోజున కూడా కొన్నిచోట్ల షోలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి డబుల్ ఇస్మార్ట్ విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా చైతన్య రెడ్డి తీవ్రస్థాయిలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రికవరీ గురించి మాట్లాడితే పూరి బృందం సభ్యుల నుంచి స్పందన లభించలేదు. ఇంటికి వెళ్లడానికి కూడా ప్రయత్నిస్తే అనుమతించలేదు. చివరికి ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేశారని చైతన్య రెడ్డి చెబుతున్నారు..

ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఒకవేళ దీనిపై చార్మి.. పూరి జగన్నాథ్ గనుక స్పందిస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper