Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni : రజినీకాంత్ మూవీ లో విలన్ గా రామ్ పోతినేని.. రెమ్యూనరేషన్ ఏ...

Ram Pothineni : రజినీకాంత్ మూవీ లో విలన్ గా రామ్ పోతినేని.. రెమ్యూనరేషన్ ఏ రేంజ్ డిమాండ్ చేస్తున్నాడంటే..

Ram Pothineni: యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న రామ్ పోతినేని , తొలిసారి తన కెరీర్ లో ఒక ప్రయోగాత్మక అడుగు వేయబోతున్నాడు. ఇంత కాలం హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రామ్, మొదటిసారి వెండితెర పై విలన్ గా కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా , అస్వత్ మారిముత్తు దర్శకత్వం లో , కమల్ హాసన్ […]

Ram Pothineni: యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న రామ్ పోతినేని , తొలిసారి తన కెరీర్ లో ఒక ప్రయోగాత్మక అడుగు వేయబోతున్నాడు. ఇంత కాలం హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రామ్, మొదటిసారి వెండితెర పై విలన్ గా కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా , అస్వత్ మారిముత్తు దర్శకత్వం లో , కమల్ హాసన్ నిర్మాణం లో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ అనే చిత్రం లో రామ్ చరణ్ ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. ఇది ఆయన అభిమానులకు మింగుడు పడని విషయమే. కానీ కొంతమంది అభిమానులు మాత్రం సంతోషిస్తున్నారు. భారీ పాన్ ఇండియన్ చిత్రం లో రజినీకాంత్ ని ఢీ పాత్ర రావడం రామ్ కి మంచి బూస్ట్ ని ఇస్తుందని అంటున్నారు.

ఈ సినిమా హిట్ అయితే , రామ్ తమిళనాడు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతాడు అనే అభిమానులు చూస్తున్నారు. కానీ అత్యధిక శాతం మంది అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లోనే ఉన్నాడు , కానీ ఒక మంచి కంటెంట్ తో వస్తే , బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సత్తా ఆయనకు ఉంది. అలాంటి స్టామినా పెట్టుకొని విలన్ క్యారెక్టర్ ఒప్పుకోవడం అసలు ఏ మాత్రం నచ్చడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రామ్ రజినీకాంత్ కి అల్లుడిగా కనిపించబోతున్నాడు అట. అదే విధంగా రామ్ కి అత్తగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించబోతుంది. ఇక రజినీకాంత్ కి కూతురు గా రాశీ ఖన్నా నటించబోతుంది. గతం లో ఈమె రామ్ తో కలిసి ‘హైపర్’, ‘శివమ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇందులో కూడా రామ్ కి జోడిగా ఆమెనే ఉండబోతుంది. కానీ అప్పుడు హీరో, ఇప్పుడు విలన్. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. రీసెంట్ గా రామ్ హీరో గా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో తొలిసారి ఆయన స్వీయ దర్శకత్వం లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తో పాటు ‘ధర్మన్ ‘ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నాడు రామ్. ఈ సినిమా కోసం రామ్ ఏకంగా పాతిక కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నాడట. ఆయన కెరీర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper