Dharman Movie : సూపర్‌స్టార్ రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్.. ఇప్పుడు వీరితో పాటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని! ఈ ముగ్గురు స్టార్ హీరోల పేర్లు ఒకే ప్రాజెక్టులో వినిపిస్తేనే సినీ అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ధర్మన్’ ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్తో వార్తల్లో నిలిచింది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో రామ్ పోతినేని ఎంట్రీ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
గన్ అందించిన రజినీ.. స్టైలిష్‌గా అందుకున్న రామ్!
‘ధర్మన్’ చిత్రంలో రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓ విమానంలో ప్రయాణికులకు టర్బులెన్స్ హెచ్చరిక చేసే ప్రకటనతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తెరపైకి వచ్చే సన్నివేశం అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ ఓ గన్ను రామ్ వైపు విసరగా.. ఆయన ఎంతో అలవోకగా అందుకుంటారు. ఈ ఒక్క షాట్‌తోనే ఇద్దరు హీరోల మధ్య ఉండబోయే కనెక్షన్‌పై ఆసక్తి పెంచారు మేకర్స్.
ఇక రామ్ లుక్ కూడా పూర్తిగా భిన్నంగా ఉంది. స్టైలిష్ దుస్తులు, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, సిగరెట్‌తో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది.
ఇప్పటికే నయనతార, శ్రీలీల.. ఇప్పుడు రామ్ ఎంట్రీ!
ఈ సినిమాలో ఇప్పటికే లేడీ సూపర్‌స్టార్ నయనతార, యంగ్ సెన్సేషన్ శ్రీలీల భాగమైనట్లు మేకర్స్ పోస్టర్ల ద్వారా వెల్లడించారు. తాజాగా రామ్ పోతినేని చేరడంతో సినిమాలోని స్టార్ క్యాస్టింగ్ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రజినీకాంత్‌తో రామ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.
కమల్ హాసన్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్
దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల పేర్లు ఈ ప్రాజెక్టుతో ముడిపడటమే సినిమాపై భారీ అంచనాలకు కారణమైంది.
రామ్ పాత్రతో కథలో ఎలాంటి మలుపు?
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే ‘ధర్మన్’లో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రజినీకాంత్ గన్ను రామ్ అందుకునే సన్నివేశం కేవలం స్టైలిష్ ఎలివేషన్ మాత్రమేనా? లేక కథలో వీరిద్దరి మధ్య కీలకమైన సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
రజినీకాంత్‌కు రామ్ తోడవడంతో ‘ధర్మన్’ ప్రాజెక్టుపై అంచనాలు మరో మెట్టు ఎక్కాయి. ఒక్క గ్లింప్స్‌తోనే ఇంతటి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి!
Raw
Attitude
Power
OverloadedANDARIKI #RAPO SWAGATHAM!
Energetic Star @ramsayz#Dharman #KettaPaiyanSir
#SuperstarRajinikanth #KamalHaasan@rajinikanth @ikamalhaasan #Mahendran #Nayanthara @Dir_Ashwath @anirudhofficial @anbariv @iYogiBabu @SimranbaggaOffc @sreeleela14 #RaashiKhanna @nikethbommi #KarthikRajkumar @PradeepERagav @kabilanchelliah @ShruthiManjari @APIfilms @homescreenent @saregamasouth @RKFI @turmericmediaTM @magizhmandram
— Raaj Kamal Films International (@RKFI) November 8, 2026