Homeఎంటర్టైన్మెంట్Bhogi Movie: 'భోగి' ప్రొమోషన్స్ కి అనుపమ పరమేశ్వరన్ డుమ్మా..డైరెక్టర్ మోసమే కారణమా?

Bhogi Movie: ‘భోగి’ ప్రొమోషన్స్ కి అనుపమ పరమేశ్వరన్ డుమ్మా..డైరెక్టర్ మోసమే కారణమా?

Bhogi Movie: వరుస సూపర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న శర్వానంద్, రేపు భోగి చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో ఆయన ఎంత జోష్ తో పాల్గొంటున్నాడో అందరికీ తెలిసిందే. హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చాలా చురుగ్గా ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఈ చిత్రం లో మరో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రొమోషన్స్ కి రావడం లేదు. కనీసం సోషల్ […]

Bhogi Movie: వరుస సూపర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న శర్వానంద్, రేపు భోగి చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో ఆయన ఎంత జోష్ తో పాల్గొంటున్నాడో అందరికీ తెలిసిందే. హీరోయిన్ డింపుల్ హయాతి కూడా చాలా చురుగ్గా ప్రొమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఈ చిత్రం లో మరో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ మాత్రం ప్రొమోషన్స్ కి రావడం లేదు. కనీసం సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ని కూడా అప్లోడ్ చేయలేదు. అందుకు కారణం, డైరెక్టర్ తన పాత్ర గురించి చెప్పింది ఒకటైతే, తీసింది మరొకటి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మెయిన్ హీరోయిన్ రోల్ అని చెప్పి ఒప్పించారని, చివరికి కథలో ప్రధాన పాత్ర లాగా తీర్చిదిద్దారని, అందుకు అనుపమ హర్ట్ అవ్వడంతో ప్రొమోషన్స్ కి నో చెప్పిందని అంటున్నారు.

గతం లో శర్వానంద్, అనుపమ కాంబినేషన్ లో ‘శతమానం భవతి’ వంటి భారీ కమర్షియల్ హిట్ ఉంది. అప్పటి నుండే వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా అనుపమ పరమేశ్వరన్ ప్రొమోషన్స్ లో పాల్గొనలేదంటే ఎంత పెద్ద గొడవ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కనీసం సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ కి అయినా హాజరు అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి ఫిలిం నగర్ లో మంచి బజ్ ఏర్పడింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్ లో ఈ కొత్త యాంగిల్ ని చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు తీసే సంపత్ నంది లో ఇలాంటి కోణం కూడా ఉంటుందని ఈ సినిమాతోనే తెలిసింది. మరి సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper