Bhogi Movie Review: ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఊపు మీదున్న శర్వానంద్, ఇప్పుడు ‘భోగి’ చిత్రం తో మన ముందుకు వస్తుండడం తో , ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే శర్వానంద్ సినిమాలు ఈమధ్య బాగుంటున్నాయి, పైగా ఈ చిత్రం లో ఆయన ఇప్పటి వరకు చెయ్యని పాత్రని, జానర్ ని ఎంచుకున్నాడు, కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం ఆయన కెరీర్ లో పాత్ బ్రేకింగ్ గా నిలుస్తుందని అంతా ఆశించారు. ఇక ప్రొమోషన్స్ అయితే వేరే లెవెల్ లో చేశారు. ఎక్కడ చూసినా శర్వానంద్, డింపుల్ హయాతి నే కనిపించారు. అలా భారీ బజ్ తో ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చిన ఈ చిత్రం , ఎంత మేరకు అంచనాలను అందుకుందో ఈ రివ్యూ లో చూద్దాం పదండి.
కథ విషయానికి వస్తే జనాలను గజగజలాడించే ఒక ఊరి పెద్ద పటేల్ పై రివెంజ్ తీర్చునేందుకు బరిలోకి దిగుతాడు హీరో గంగ. పటేల్ అరాచకాల వల్ల ఆ ఊర్లో ఎలాంటి సమస్యలు ఎదురు అయ్యాయి, హీరో వాటిని ఎలా ఎదురుకున్నాడు?, పటేల్ ని ఎలా ఢీ కొట్టాడు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సినిమా స్క్రీన్ ప్లే ని నడిపించాడు డైరెక్టర్ సంపత్ నంది. రంగస్థలం సినిమా తరహా ఫార్ములా ని పట్టుకొచ్చి, దానికి కాస్త ఎర్రటి రక్తం, అరుపుల మసాలా కలిపి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు.
ఈ సినిమా కథలో మంచి దమ్ముంది..డైరెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా జోడించి, అన్ని రకాల ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేసి ఉండుంటే శర్వానంద్ కెరీర్ లో చాలా పెద్ద హిట్ అయ్యేది. కానీ అలా తియ్యలేదు. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు, సినిమాలో ఎదో విషయం ఉందని అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం కథ ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వెళ్తుందో చెప్పలేని పరిస్థితికి చేరుకుంటుంది. అసలు అనుకున్న కథ ఏంటి?, తీసిన కథ ఏంటి? అనే క్లారిటీ కనీసం డైరెక్టర్ సంపత్ నంది కి అయినా ఉందో లేదో అనే అనుమానం చూసే ప్రేక్షకులకు కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రివెంజ్ సన్నివేశాలు డైరెక్టర్ సరిగా రాసుకోలేదు. కనీసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా బాగుందా అంటే అది కూడా లేదు. చెవిలో డీజే పెట్టినట్టుగా ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. పాటలు కూడా ఆకట్టుకోలేదు. డైరెక్టర్ పల్లెటూరు కథ ని ఎంచుకొని, ఆ థీమ్ లో సినిమాని నడిపించకుండా , హింస, రక్తపాతం నే నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కథలో ఎమోషన్ లేకపోతే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అని చెప్పడానికి భోగి చిత్రం ఒక బెస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే శర్వానంద్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేసాడు. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆయన కష్టం కనిపించింది. ఇక హీరోయిన్స్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ , డింపుల్ హయతి లు కూడా అదరగొట్టేశారు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, చూసే ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ పెద్ద సహన పరీక్ష లాగానే అనిపిస్తుంది.ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2/5..మరి ఈ సినిమా పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.