Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ క్లైమాక్స్ కి చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ఆరంభం లో భారీ హైప్ తో ఈ సీజన్ మొదలైంది. రోహిత్, త్రిగున్ మధ్య జరిగిన గొడవల కారణంగా ఈ సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోయాయి. కానీ ఎప్పుడైతే అన్యాయంగా రోహిత్ ని టార్గెట్ చేసి, ఆడియన్స్ ఓట్లకు విలువ ఇవ్వకుండా, హౌస్ మేట్స్ ఓట్లతో బయటకు పంపారో, అప్పటి నుండే ఈ సీజన్ కి కష్టకాలం మొదలైంది. బిగ్ బాస్ నిర్వాహకులపై ఆడియన్స్ కోపం తో రగిలిపోతున్నారు. అత్యధిక శాతం మంది ఈ షో ని చూడడం మానేశారు. రోహిత్ రీ ఎంట్రీ ఉండుంటే కథ వేరేలా ఉండేది, కానీ బిగ్ బాస్ నిర్వాహకులకు ఈ సీజన్ లో సామాన్యులను టైటిల్ విన్నర్ చేయడం ఇష్టం లేదు, సెలబ్రిటీ నే టైటిల్ విన్నర్ చెయ్యాలని అనుకున్నారు, అందుకే రోహిత్ ని బలవంతంగా ఎలిమినేట్ చేసి పంపేశారు. అయితే ఇప్పుడు ఉన్న వారిలో బిగ్ బాస్ టైటిల్ కి అతి చేరువలో ఉన్న కంటెస్టెంట్ ఎవరు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
ప్రస్తుతానికి అయితే త్రిగున్ కి టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి, ఈ క్షణం వరకు, ఆయన ఆలోచనలు మొత్తం గేమ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాంటి ఎమోషన్స్ కి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక ఫ్లో లో వెళ్ళిపోతున్నాడు. ఇదే ఆడియన్స్ కి నచ్చుతోంది. అతను పదే పదే తప్పులు చేస్తున్నా కూడా ఆడియన్స్ సపోర్టు చేయడానికి ముఖ్య కారణం, గేమ్ పై అతనిలో ఉన్న కసినే. రోహిత్ హౌస్ లో ఉన్న సమయం లోనే త్రిగున్ బాగా రైజ్ అయ్యాడు. ఇద్దరి మధ్య ఆడియన్స్ ఓటింగ్ నువ్వా, నేనా అనే రేంజ్ కి చేరుకుంది. ఎప్పుడైతే రోహిత్ ఎలిమినేట్ అయ్యాడో త్రిగున్ కి వార్ వన్ సైడ్ లాగా అయిపోయింది. ఇక త్రిగున్ తర్వాత టైటిల్ రేస్ కి దగ్గరగా ఉన్న మరో కంటెస్టెంట్ ముకేశ్. హౌస్ లో టాస్కుల పరంగా ముకేశ్ కి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవ్వరు లేరు. త్రిగున్ ని కూడా టాస్కుల్లో చిత్తుచిత్తుగా ఓడించిన చరిత్ర ముకేశ్ సొంతం. కానీ ఈయన ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అదే ఇతన్ని గేమ్ లో వెనక్కి నెడుతోంది.
ఏదైనా టాస్కులో ఓడిపోతే అసలు తీసుకోలేడు , నోరు జారుతాడు. ఈ వారం అయితే అతిధిగా వచ్చిన దివ్య నిఖిత మీద కూడా కోపం తెచ్చుకుంటాడు. ఇది ముకేశ్ కి చాలా నెగెటివ్ చేసింది. కానీ హౌస్ మేట్స్ మొత్తం ఇతన్ని కార్నెర్ చేస్తున్నారు. ఇది ముకేశ్ కి రాబోయే రోజుల్లో పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు , రోహిత్ ఫ్యాన్స్ ఓట్లు కూడా ముకేశ్ కి కీలకం కావొచ్చు. అయితే రోహిత్ ఎలిమినేట్ అయ్యాక, అతని అభిమానులు ఈ షో చూడడం మానేశారు. కాబట్టి వాళ్ళు ఎవ్వరికీ ఓటు వేయడం లేదు. అందుకే ముకేశ్ ఇంకా రెండవ స్థానం లోనే కొనసాగుతున్నాడు. కానీ ఫినాలే వీక్ లో టైటిల్ విన్నర్ గా ఎవరిని నిల్చోబెట్టాలి అనేది రోహిత్ ఫ్యాన్స్ చేతిలోనే ఉంది. వాళ్లకు త్రిగున్ ని టైటిల్ విన్నర్ గా చూడడం అసలు ఇష్టం లేదు. చివరి వారం లో రోహిత్ అభిమానులు మొత్తం మూకుమ్మడిగా ముకేశ్ కి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ముకేశ్ గెలుపుకి తిరుగులేదు అనే చెప్పొచ్చు. కాబట్టి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ముకేశ్ , త్రిగున్ లకు సమానంగా ఉన్నాయి. చూడాలి మరి ఎవరు టైటిల్ గెలవబోతున్నారు అనేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.