Homeబిజినెస్Maruti Ertiga: 8 లక్షలకే 7 సీటర్ కారు.. దీనికి ఎందుకంత డిమాండ్.. ఫీచర్లు.. మైలేజ్...

Maruti Ertiga: 8 లక్షలకే 7 సీటర్ కారు.. దీనికి ఎందుకంత డిమాండ్.. ఫీచర్లు.. మైలేజ్ అలా ఉన్నాయి మరి..

Maruti Ertiga: భారతీయ కార్ల మార్కెట్లో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణించడానికి వీలుగా ఉండే కారులను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో మహీంద్రా.. టయోటా.. వంటి కంపెనీలు పోటీపడుతున్నప్పటికీ.. ఒక కంపెనీ మాత్రం తిరుగులేని స్థాయిలోకి దూసుకు వచ్చింది. అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ధర తక్కువతో.. మంచి మైలేజ్ తో.. విశాలమైన క్యాబిన్ తో సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కాలంలో […]

Maruti Ertiga: భారతీయ కార్ల మార్కెట్లో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణించడానికి వీలుగా ఉండే కారులను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో మహీంద్రా.. టయోటా.. వంటి కంపెనీలు పోటీపడుతున్నప్పటికీ.. ఒక కంపెనీ మాత్రం తిరుగులేని స్థాయిలోకి దూసుకు వచ్చింది. అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ధర తక్కువతో.. మంచి మైలేజ్ తో.. విశాలమైన క్యాబిన్ తో సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ కాలంలో చాలామంది కోరుకునే విధంగా మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆ కంపెనీ మారుతి సుజుకి. ఆ మోడల్ పేరు ఎర్టిగా. మనదేశంలో అత్యధికంగా అమరవుతున్న సెవెన్ సీటర్ కార్లలో ఎర్టిగా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. అక్టోబర్ 2026 విక్రయాల గణాంకాల ప్రకారం 20,641 కారు యూనిట్లు అమ్ముడుపోయాయి. తద్వారా ఎర్టిగా మొదటి స్థానంలో నిలిచింది. మహీంద్రా స్కార్పియో వంటి ప్రముఖ మోడళ్లను వెనక్కి నెట్టి.. మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ధర ఎంతంటే?

మారుతి సుజుకి ఎర్టిగా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 8.80 లక్షల్లో నుంచి ఉంటుంది. టాప్ వేరియంట్ ధర 13.20 లక్షల వరకు ఉంటుంది.

ఇంజన్.. మైలేజ్ వివరాలు ఎలా ఉన్నాయంటే

ఎర్టిగాలో 1.5 లీటర్ K15 C పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది సుమారు 103 PS పవర్, 137 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ఉంది. పెట్రోల్, సిఎన్జి ఆప్షన్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ మాన్యువల్ మైలేజీ.. సుమారు 20.51 kmpl. సిఎన్జి మైలేజీ సుమారు 26.11km/kg.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

సెవెన్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ కూడా దీనికి లభిస్తుంది. ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్.. క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఉంది. రియర్ ఏసి వెంట్స్, రిక్లయినింగ్ సీట్లు.. రియర్ పార్కింగ్ కెమెరా.. ఎయిర్ బ్యాగులు..ABS, EBD వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తక్కువ బడ్జెట్లో కుటుంబం మొత్తం ప్రయాణించడానికి 7 సీటర్ కారు కొనాలి అనుకునే వారికి మారుతి ఎర్టిగా మంచి ఎంపిక. ముఖ్యంగా మైలేజీ.. నిర్వహణ ఖర్చులు.. సర్వీస్ సౌకర్యం అంటే అంశాలకు ప్రయారిటీ ఇచ్చే వారికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే ఈ కారు మూడవ వరుసలో పెద్దవారు ఎక్కువసేపు ప్రయాణించేటప్పుడు స్థలం కొంత పరిమితంగా అనిపించవచ్చు. ఏడుగురు ప్రయాణికులతో లగేజీ పెట్టుకునే స్థలం కూడా తగ్గుతుంది. అందువల్ల కొనుగోలు చేసినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి టెస్ట్ డ్రైవ్ చేయడం మంచిది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper