Tollywood Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ఫుల్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఎవరు కూడా పెద్దగా డైరెక్షన్ వైపైతే మొగ్గు చూపడలేదు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒకటి రెండు సక్సెస్ లు రావడంతోనే మేం కూడా డైరెక్షన్ చేయగలం. మమ్మల్ని మేము ఎలా చూపించుకోవాలో మాకు తెలుసనే రేంజ్ లో చెలరేగిపోతున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం, రామ్ లాంటి హీరోలు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ స్వీయ డైరెక్షన్ లో హీరోలుగా ఒక సినిమాని కూడా స్టార్ట్ చేశారు. ఇక ప్రస్తుతం వీళ్ళ బాటలోనే సుధీర్ బాబు కూడా నడుస్తున్నాడు. నిజానికి ఒక హీరో డైరెక్షన్ చేయడం వల్ల తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలో తనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ దానివల్ల చాలా మైనస్ లు ఉన్నాయి. సినిమా కథని పక్కనపెట్టి వాళ్ళని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల కథ పక్క కెళ్ళిపోయి వాళ్లు మాత్రమే సెంట్రిక్ పాయింట్ గా కనిపిస్తూ ఉంటారు.
ఎప్పుడైతే కథ పక్కకెళ్తుందో సినిమాకి ఆటోమేటిక్ గా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా సినిమా కథలోని సోల్ ను పట్టుకుని ముందుకు సాగితే హీరోలు కూడా చాలా బాగా డైరెక్షన్ చేసి సత్తా చూపించగలిగే కెపాసిటి ఉన్నవారు అవుతారు.
లేకపోతే మాత్రం అనవసరంగా డైరెక్షన్ చేశారు. చక్కగా హీరోగా కొనసాగితేనే బాగుండేది కదా అనే విమర్శలను కూడా మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హీరో అంటే చెప్పింది చేసి వెళ్ళిపోవడమే కానీ డైరెక్షన్ చేపట్టిన తర్వాత అన్ని క్రాఫ్ట్ ల మీద వాళ్ళకి ఎంతో కొంత గ్రిప్ ఉండాలి.
దాన్ని పర్ఫెక్ట్ గా పోట్రే చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే వాళ్లకు డైరెక్టర్ గా ఒక గొప్ప గుర్తింపైతే లభిస్తుంది… ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్న హీరోల్లో ఎంతమంది సక్సెస్ అవుతారు ఎంతమంది డౌన్ ఫాల్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది…