Homeఎంటర్టైన్మెంట్Thrigun: హీరో రామ్ తో నాకు పోలికలు ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిగున్!

Thrigun: హీరో రామ్ తో నాకు పోలికలు ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిగున్!

Thrigun: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో మొదటి వారమే ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసుకున్న కంటెస్టెంట్ త్రిగున్. ప్రస్తుతానికి అతను నెగెటివ్ గేమ్ ఆడుతున్నాడు, అతనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది, అయినప్పటికీ కూడా బోలెడంత కంటెంట్ ఇస్తున్నాడు , నాలుగు వారాలకు సరిపడ కంటెంట్ ని ఆయన కేవలం వారం రోజుల్లోనే ఇచ్చాడు. కానీ టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలిగే కెపాసిటీ ఉంది , […]

Thrigun: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో మొదటి వారమే ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసుకున్న కంటెస్టెంట్ త్రిగున్. ప్రస్తుతానికి అతను నెగెటివ్ గేమ్ ఆడుతున్నాడు, అతనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది, అయినప్పటికీ కూడా బోలెడంత కంటెంట్ ఇస్తున్నాడు , నాలుగు వారాలకు సరిపడ కంటెంట్ ని ఆయన కేవలం వారం రోజుల్లోనే ఇచ్చాడు. కానీ టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలిగే కెపాసిటీ ఉంది , రాబోయే రోజుల్లో పాజిటివిటీ ని సంపాదించుకుంటే కచ్చితంగా ఇతను కూడా టైటిల్ రేస్ లో నిలబడగలడు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంతకీ ఈ త్రిగున్ ఎవరు?, ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ వెతకడం మొదలు పెట్టగ, ఇతని గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

ఈయన 2009 వ సంవత్సరం లో ‘కథ’ అనే చిత్రం ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆరోజుల్లో ఈయన్ని చూసిన ప్రతీ ఒక్కరు , ఇతను అచ్చు గుద్దినట్టు హీరో రామ్ పోతినేని లాగా ఉన్నాడే, యాక్టింగ్ కూడా చాలా బాగుంది, మంచి భవిష్యత్తు ఉందని అంతా అనుకున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు , తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చింది. ఇక ఈ ఏడాది చెన్నై లవ్ స్టోరీ లో సెకండ్ హీరో గా నటించి మరో భారీ కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు.

అయితే గతం లో ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనని అందరూ రామ్ తో పోల్చి చూడడం పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘రామ్ చాలా గొప్ప నటుడు. అతనికి అద్భుతమైన లుక్స్ , టాలెంట్ ఉంది. ఆయన పోలికలతో కాస్త నేను కూడా ఉండడం నా అదృష్టం. కానీ ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు , ఆయనతో ఊరికే నన్ను పోల్చినప్పుడు మాత్రం కోపం వస్తుంది. చాలా మంది నన్ను రామ్ అనుకొని కలిశారు కూడా. అయినా నన్ను రామ్ తో పోల్చి చూడడం ఏంటి, లుక్స్ పరంగా మ్యాచ్ అవ్వచ్చేమో కానీ, ఆయన ఎంతో పెద్ద స్టార్ , అద్భుతమైన నటుడు, ఆయన నుండి నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు త్రిగున్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper