Chiranjeevi: బిగ్గర్ దెన్ బచ్చన్.. కోట్ల రూపాయల పారితోషికం.. సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ప్రయాణం.. డ్యాన్స్ వేస్తే విజిల్స్.. డైలాగ్ చెప్తే క్లాప్స్.. సినిమా ఒప్పుకుంటే అదే మహాభాగ్యం అనుకునే నిర్మాతలు.. ఇలాంటి తిరుగులేని స్టార్ డం ను సొంతం చేసుకున్నారు చిరంజీవి.. ఎటువంటి నేపథ్యం లేకుండా ఇక్కడ దాకా చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన గ్రేస్.. ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అటువంటి చిరంజీవి ఒక దశలో సైలెంట్ అయిపోయారు. ఏకంగా 9 నెలల పాటు విరామం తీసుకున్నారు. అది కూడా కెరియర్ పీక్ స్టేజిలో ఉండగానే.. చిరంజీవి అలా ఎందుకు చేయాల్సి వచ్చింది.. అలా ఎందుకు ఉండి పోవాల్సి వచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగింది..
చిరంజీవి 1994 – 1995 మధ్యకాలంలో బిగ్ బాస్.. రిక్షావోడు వంటి చిత్రాలలో నటించారు. బిగ్ బాస్ భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ.. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేకపోయింది. అవుట్ డేటెడ్ స్టోరీ. రొటీన్ స్క్రీన్ ప్లే కావడంతో జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. చిరంజీవి స్టెప్పులు కూడా క్లాప్స్ కొట్టిస్తాయి. పాటలు.. స్టెప్పులు మాత్రమే కాదు కదా.. సినిమాలో స్టోరీ ఉండాలి కదా.. ఆ స్టోరీ ఎంగేజింగ్ చేయాలి కదా.. ఆ తర్వాత 1995 కాలంలో రిక్షావోడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో కూడా పాటలు అప్పట్లో అదరగొట్టాయి. చిరంజీవి స్టెప్పులు చప్పట్లు కొట్టించాయి. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్నది.
మరోవైపు తోటి నటులు విక్టరీ వెంకటేష్ పవిత్ర బంధం.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్థాయిని.. స్టార్ హీరో ఇమేజిని సొంతం చేసుకున్నారు. మరోవైపు నాగార్జున నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాతో సరికొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా రెండు భారీ ప్లాప్ లు రావడంతో చిరంజీవికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీన్ని తోడు కొంత మంది చిరంజీవి కెరియర్ మొత్తం ముగిసిందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో దాదాపు 1995 నుంచి 96 వరకు అంటే ఎనిమిది నెలల పాటు చిరంజీవి విరామం తీసుకున్నారు.. అప్పట్లో వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు కుటుంబ కథా చిత్రంతో విజయాలు సాధించారు. చిరంజీవి మాత్రం తన పాత మాస్ ఫార్ములా చిత్రాలను చేయడంతో జనాలకు అంతగా ఇంట్రెస్ట్ కలగలేదు. దీంతో ఆయన విరామం తీసుకుని.. మాస్ చిత్రాలకు దూరంగా ఉండాలి అనుకున్నారు. సరైన కథ కోసం నిరీక్షించారు. రొటీన్ సినిమాలు చేయడం. ప్రేక్షకులను నిరాశపరచడం.. నిర్మాతలకు నష్టం కలగజేయడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేకపోయింది. తనకు తగిన విభిన్నమైన.. సహజమైన పాత్రులు దొరికేవరకు కెమెరా ముందుకు రాకూడదని భావించి. స్వచ్ఛందంగా ఎనిమిది నెలల పాటు విరామం తీసుకున్నారు. ఆవిరమణ తర్వాత 1997లో హిట్లర్ వంటి బలమైన కుటుంబం, సెంటిమెంట్ ఉన్న స్టోరీ తో చిరంజీవి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు.
హిట్లర్ సినిమా ను చేయకూడదని.. ఆ టైటిల్ పెట్టకూడదని చాలామంది చిరంజీవిని వారించారు. అయినప్పటికీ చిరంజీవి కుటుంబ సెంటిమెంటు ఉన్న హిట్లర్ కథను ఎంచుకున్నారు. చిరంజీవి తీసుకున్న రిస్క్ ఫలితం రూపంలో కనిపించింది. ఐదుగురు చెల్లెళ్లను కంటికి రెప్పలాగా చూసుకునే అన్నయ్య పాత్రలో చిరంజీవి ఈ సినిమాలను నటించారు. అప్పటివరకు ఉన్న మాస్ హీరో ఇమేజ్ నుంచి ఫ్యామిలీ హీరోగా ముద్ర పడిపోయారు. అప్పట్లో వస్తున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల పోటీని తట్టుకొని.. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలతో కూడిన కథలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చిరంజీవి ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఆ రోజుల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనను తిరిగి సక్సెస్ బాట పట్టించే విధంగా చేసింది. హిట్లర్ తర్వాత.. మాస్టర్. చూడాలని ఉంది. బావగారు బాగున్నారా.. స్నేహం కోసం వంటి విభిన్నమైన చిత్రాలతో చిరంజీవి మళ్ళీ తన స్టార్ డం నిలబెట్టుకున్నారు.
1997లో విడుదలైన హిట్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఆ ఏడాది విడుదలైన చిత్రాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఏకంగా 42 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. కేవలం యువత మాత్రమే కాకుండా.. మహిళ ప్రేక్షకులు.. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద ఎత్తున వచ్చారు. రక్తం చిందించే ఈ యాక్షన్స్ అన్వేషం లేకుండా కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధం.. కుటుంబ విలువలతో కూడా మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయగలరని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి సినిమాల ఎంపికలో జాగ్రత్త వహించారు. చిరంజీవి 2.0 అప్పటి నుంచే మొదలైంది.
నేటి కాలంలో చాలా మంది హీరోలు హిట్లు రాగానే విర్రవీగిపోతున్నారు. వైఫల్యాలు ఎదురుకాగానే అడ్రస్ లేకుండా పోతున్నారు. కాని చిరంజీవి వైఫల్ తట్టుకున్నారు. విజయాలను ఆస్వాదించారు. అలాగని గర్వాన్ని.. ప్రదర్శించలేదు. అందువల్లే ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. మెగాస్టార్ అప్పటికి.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక్కడే అని నిరూపిస్తున్నారు.