Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: రాప్తాడు ఘటన వెనుక.. అసలు కారణాన్ని చెప్పిన జగన్..

YS Jagan: రాప్తాడు ఘటన వెనుక.. అసలు కారణాన్ని చెప్పిన జగన్..

YS Jagan: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి.. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట రాప్తాడు నేతలు కూడా ఉన్నారు. బాలికను పరామర్శించిన తర్వాత అక్కడ విలేకరులతో జగన్ మాట్లాడారు. బాలికపై జరిగిన అమానుషపు దాటిని జగన్ ఖండించారు. పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఈ తప్పునకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. సిగ్గుతో తలదించుకోవాలని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. […]

YS Jagan: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి.. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట రాప్తాడు నేతలు కూడా ఉన్నారు. బాలికను పరామర్శించిన తర్వాత అక్కడ విలేకరులతో జగన్ మాట్లాడారు. బాలికపై జరిగిన అమానుషపు దాటిని జగన్ ఖండించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఈ తప్పునకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. సిగ్గుతో తలదించుకోవాలని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అస్తవ్యస్త విధానాల వల్ల ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని.. ప్రతి ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని.. మద్యం ఏరులై ప్రవహిస్తోందని.. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఇటువంటి రాక్షస క్రీడలకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని.. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు తాపత్రయపడుతున్నారని జగన్ విమర్శించారు.

రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాల్సిందే. కాకపోతే అన్ని విషయాల్లో కాదు. ప్రజలను ప్రభావితం చేసే సున్నితమైన అంశాలలో కూడా రాజకీయాలు చేయడం.. రాజనీతి అనిపించుకోదు. కానీ ఈ విషయంలో జగన్ ఎటువంటి రాజనీతి అమలు చేయరు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది కేవలం రాజకీయాలు మాత్రమే అని కూటమినేతలు ఆరోపిస్తున్నారు.

గాయపడిన బాలిక కుటుంబం వైసిపితో సంబంధం కలిగి ఉంది. బాలిక బాబాయ్ వైసిపి మండల కన్వీనర్ గా పనిచేస్తున్నారు. అయినప్పటికీ లోకేష్ ఈ విషయంలో రాజకీయాలు చూడలేదు. బాలిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు. ఆమె ప్రాణాలు నిలబడేందుకు ప్రయత్నాలు చేశారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి బెంగళూరు తరలించారు. అక్కడి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులతో నిత్యం మాట్లాడుతూ.. బాలిక ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సుమారు 11 గంటల పాటు వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత నిన్న ఆదివారం లోకేష్ బెంగళూరు వెళ్లి బాలికను పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎటువంటి అవసరం వచ్చినా సరే స్థానిక ఎమ్మెల్యే సునీత.. తనను సంప్రదించాలని సూచించారు.

ఇందులో లోకేష్ రాజకీయం చేయలేదు. జరిగిన ఘటన పట్ల బాధపడ్డారు. వెంటనే కౌన్సిలర్లను రంగంలోకి దించి.. ఆ స్కూల్లో పిల్లలకు మానసిక ధైర్యం కల్పించారు. వాస్తవానికి ఆ స్కూల్లో సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ భవిత సెంటర్ నిర్మాణంలో ఉంది కాబట్టి.. ప్రతిరోజు కార్మికులు వస్తున్నారు. అందువల్లే వచ్చేవారు కార్మికులై ఉంటారని అక్కడి ప్రిన్సిపాల్ భావించారు. అంతేతప్ప.. సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయినట్టు కాదు. కానీ ఈ విషయాన్ని కూడా జగన్ రాజకీయం చేయడాన్ని కూటమినేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో.. ఆయన పార్టీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని ఏం చేశాడో.. ఆయన పార్టీకి సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఒక బాలిక మీద కన్ను వేసి.. అతడి తమ్ముడిని ఏం చేశాడో అందరికీ తెలుసని కూటమినేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతిదీ రాజకీయం చేస్తుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 లక్షలు ఇస్తామని చెప్పడం జగన్ రాజకీయ పిచ్చికి పరాకాష్ట అని కూటమినేతలు గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper