Homeఎంటర్టైన్మెంట్Ram Charan, Sukumar: బౌండెడ్ స్క్రిప్ట్ తోనే.. రామ్ చరణ్.. సుకుమార్ సినిమా కథ ఇదే..

Ram Charan, Sukumar: బౌండెడ్ స్క్రిప్ట్ తోనే.. రామ్ చరణ్.. సుకుమార్ సినిమా కథ ఇదే..

Ram Charan, Sukumar: ఇటీవల కాలంలో టాలీవుడ్లో దర్శకులకు ఏమైందో తెలియడం లేదు. పెద్దపెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నప్పటికీ.. బౌండెడ్ స్క్రిప్ట్ తో కాకుండా.. అప్పటికప్పుడు సన్నివేశాలు రాసుకుని చేసేస్తున్నారు. దీనివల్ల ఫలితాలు దెబ్బ కొడుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ అభిమానుల అంచనాలు అందుకుక పోవడంతో టాప్ హీరోలు ఒక రకమైన టెన్షన్ లో పడిపోయారు.. అయితే ఇదే ఫలితాలు కొనసాగితే వారి మార్కెట్ పడిపోవడం ఖాయం. అందువల్లే బౌండెట్ స్క్రిప్ట్ అనేది కచ్చితంగా ఉండాలని హీరోలు […]

Ram Charan, Sukumar: ఇటీవల కాలంలో టాలీవుడ్లో దర్శకులకు ఏమైందో తెలియడం లేదు. పెద్దపెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నప్పటికీ.. బౌండెడ్ స్క్రిప్ట్ తో కాకుండా.. అప్పటికప్పుడు సన్నివేశాలు రాసుకుని చేసేస్తున్నారు. దీనివల్ల ఫలితాలు దెబ్బ కొడుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ అభిమానుల అంచనాలు అందుకుక పోవడంతో టాప్ హీరోలు ఒక రకమైన టెన్షన్ లో పడిపోయారు.. అయితే ఇదే ఫలితాలు కొనసాగితే వారి మార్కెట్ పడిపోవడం ఖాయం. అందువల్లే బౌండెట్ స్క్రిప్ట్ అనేది కచ్చితంగా ఉండాలని హీరోలు తమ దర్శకులకు చెప్పకనే చెప్పారు. అందువల్లే బౌండెడ్ స్క్రిప్ట్ తోనే దర్శకులు.. సినిమాలను మొదలుపెడుతున్నారు.

ఆదివారం రాంచరణ్.. సుకుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా మొదలైంది. బౌండెడ్ స్క్రిప్ట్ కు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి.. నవీన్.. దర్శకుడు సుకుమార్.. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రత్నవేలు హాజరయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే ఆమె కంటే ముందు సారా అర్జున్.. ఇంకా కొంతమందిని పరిశీలించారని సమాచారం. సాత్విక విషయంలో కూడా సుకుమార్ ఒక నిర్ణయం తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది.

సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తారు. మరి ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ఇంతవరకు సినిమాలు తీసింది లేదు. దేవిశ్రీ చేతిలో ప్రస్తుతం ఎల్లమ్మ తప్ప పెద్ద ప్రాజెక్టులు కూడా లేవు. అనిరుధ్.. తమన్ దూసుకుపోతున్నారు. తమన్ తో గాని, అనిరుద్ తో గాని సుకుమార్ ఇంతవరకు సినిమా తీయలేదు. పైగా సుకుమార్ గత చిత్రం పుష్ప 2 కు తిరుగులేని స్థాయిలో దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. అలాంటప్పుడు దేవిశ్రీ ని సుకుమార్ పక్కన పెడతాడా అనేది తేలాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే పూర్తయింది. అది కూడా బౌండెడ్ రూపంలో తీర్చిదిద్దారు. ఈ ప్రకారం చూసుకుంటే రంగస్థలంను మించిన హిట్ కొట్టాలని అటు రామ్ చరణ్.. ఇటు సుకుమార్ భావిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఇంతవరకు సుకుమార్ ఫ్లాప్ సినిమాలు తీయలేదు. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అయింది. పుష్ప 1, పుష్ప 2 సినిమాలు టాలీవుడ్ రికార్డులను తిరగ రాశాయి. రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ తో వస్తే.. తాజాగా తీయబోయే సినిమా పిరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. దీనికి మైథాలజికల్ టచ్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్.. మిగతా కాస్ట్.. వంటి వివరాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper