Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: 2006 లోనే ఇరుముడి లాంటి కథ చిరంజీవి దగ్గరికి.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే...

Megastar Chiranjeevi: 2006 లోనే ఇరుముడి లాంటి కథ చిరంజీవి దగ్గరికి.. ఎందుకు రిజెక్ట్ చేశారంటే…

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒకానొక సందర్భంలో చిరంజీవి నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేంతల క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడంటే చిరంజీవి సినిమా సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చాలా వైవిద్య భరితమైన కథలైతే వచ్చాయట. ముఖ్యంగా రవితేజ హీరోగా చేసిన ‘ఇరుముడి’ సినిమా ఈ మధ్యకాలంలో సూపర్ […]

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒకానొక సందర్భంలో చిరంజీవి నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేంతల క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడంటే చిరంజీవి సినిమా సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 2006వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చాలా వైవిద్య భరితమైన కథలైతే వచ్చాయట. ముఖ్యంగా రవితేజ హీరోగా చేసిన ‘ఇరుముడి’ సినిమా ఈ మధ్యకాలంలో సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఇలాంటి తరహా కథతోనే పరుచూరి బ్రదర్స్ తన దగ్గరికి ఒక కథనైతే తీసుకొచ్చారట. కానీ చిరంజీవి అది చాలా సాఫ్ట్ గా ఉందని అప్పుడున్న పరిస్థితుల్లో మాస్ సినిమాలైతేనే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయని చెప్పడంతో ఆ కథను పక్కన పెట్టేసారు. మొత్తానికైతే అయ్యప్ప స్వామి కథతో తెరెక్కాల్సిన ఆ సినిమా ఆగిపోయింది. ఇక మొత్తానికైతే రవితేజ ఇప్పుడు ఇరుముడి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. దాంతో చిరంజీవి అప్పట్లో రిజెక్ట్ చేసిన కథ మరోసారి తెర మీదకి వచ్చిందనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి అప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని ఈ సినిమా అప్పుడు చేస్తే ఆడేది కాదు అని నిర్ణయించుకున్నాడట. కానీ అలాంటి కథతోనే ఇప్పుడు రవితేజ వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించడంతో చిరంజీవి అప్పట్లోనే ఇలాంటి సినిమా చేసి ఉంటే బాగుండేదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కానీ అప్పుడున్న జనాల మైండ్ సెట్ ప్రకారం ఈ సినిమా వాళ్లకు నచ్చకపోయేది. కాబట్టి అయ్యప్ప స్వామి మీద సినిమా చేసే ఉద్దేశ్యం తనకు లేదని అప్పట్లోనే చిరంజీవి చెప్పేసాడు… ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో ‘కాకా’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper