Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie Postponed: ప్యారడైజ్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి అసలు కారణం ఆయనేనా..?

The Paradise Movie Postponed: ప్యారడైజ్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి అసలు కారణం ఆయనేనా..?

The Paradise Movie Postponed: సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణిలో సాగే సినిమాలు రెగ్యులర్ గా రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే ప్యారడైజ్… నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అటెన్షన్ క్రియేట్ […]

The Paradise Movie Postponed: సినిమా ఇండస్ట్రీలో మూస ధోరణిలో సాగే సినిమాలు రెగ్యులర్ గా రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ సినిమాలు ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే ప్యారడైజ్… నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా నాని ని డిఫరెంట్ అవతారంలో చూపిస్తున్నందుకు శ్రీకాంత్ ఓదెల టాలెంట్ ని అందరు మెచ్చుకుంటున్నారు. ఇక ఈ సినిమా మొదట మార్చి 26వ తేదీన రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి సినిమా షూటింగ్ కాస్త లేట్ అయింది. దానివల్ల జూన్ లో రిలీజ్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది అనే వార్తలైతే వచ్చాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు…

ఇక ఇదంతా చూస్తున్న నాని అభిమానులు సినిమా రిలీజ్ లేట్ అవుతున్నందుకు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నప్పటికి సినిమా అవుట్ పుట్ కోసమే సినిమా రిలీజ్ లేటవుతుంది. కాబట్టి ఔట్ పుట్ బాగా వస్తే సినిమా ఫైనల్ గా సక్సెస్ ని సాధిస్తుంది. దానివల్ల అంత హ్యాపీ గా ఉండచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

నిజానికి సినిమా అన్ని రోజుల పాటు పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అనిరుధ్ అని చెబుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి అనిరుధ్ ప్రస్తుతం చాలా సినిమాలు కమిటై ఉన్నాడు.

ఆ సినిమాలు ఫినిష్ చేసి ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత అనిరుధ్ కి రెండు నెలల పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఈ సినిమాను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్లే సినిమా రిలీజ్ అనేది బాగా లేట్ అవుతుందని సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper